Corona Updates: తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు.. ఇవాళ కొత్త ఎన్ని కేసులు నమోదు అయ్యాయంటే..

|

Dec 20, 2020 | 10:51 AM

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య ఒక రోజు పెరుగుతుంది. మరో రోజు తగ్గుతుంది. శనివారం వరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం ..

Corona Updates: తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు.. ఇవాళ కొత్త ఎన్ని కేసులు నమోదు అయ్యాయంటే..
Follow us on

Corona Updates: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య ఒక రోజు పెరుగుతుంది. మరో రోజు తగ్గుతుంది. శనివారం వరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు అనిపించినా నేడు కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 592 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 643 మంది కరోనా నుండి కోలుకుని ఆస్పత్రుల నుండి డిశ్చార్జి అవ్వగా.. ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 2,81,414కు చేరింది. వీరిలో 2,73,013 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,888 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కారణంగా 1513 మంది చనిపోయారు. ఇక రాష్ట్రంలో రికవరీ రేట్ 97.01 శాతంగా ఉంది.

జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే.. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 119 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఆ తరువాత మేడ్చల్ మల్కాజిగిరిలో 70 కేసులు నమోదు అయ్యాయి. రంగారెడ్డి 57, వరంగల్ అర్బన్ 40 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.

 

Also read:

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన హైదరాబాదీ

మోడీ సడన్ టూర్… ఢిల్లీలోని రకాబ్‌గంజ్ గురుద్వారాను దర్శించుకున్న ప్రధాని నరేంద్ర మోడీ…