తెలుగురాష్ట్రాల్లో వ్యాక్సినేషన్‌ను స్పీడప్ చేశారు వైద్యారోగ్య శాఖ అధికారులు. కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో 45ఏళ్ల పైబడిన వాళ్లందరికి వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో వ్యాక్సినేషన్ సెంటర్ల దగ్గర ప్రజలు క్యూ కడుతున్నారు. హైదరాబాద్‌లో ఉస్మానియా, గాంధీ, ఫీవర్ ఆస్పత్రుల దగ్గర ఆధార్ కార్డులు చేతపట్టుకుని భారీ సంఖ్యలో ప్రజలు ఉదయం నుంచే చేరుకున్నారు. అటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా సేమ్ సిట్యువేషన్ కనిపిస్తోంది.
హైదరాబాద్‌లోని ప్రభుత్వ ప్రాథమిక చికిత్స కేంద్రాల్లో వ్యాక్సిన్ అందుబాటులో ఉందన్నారు అధికారులు. బషీర్‌బాగ్‌లోని ప్రభుత్వాస్పత్రిలో ప్రతి రోజు 200డోసులు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నామన్నారు సూపరింటెండెంట్ రాజేంద్రనాథ్. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రావణి అందిస్తారు.
తెలంగాణలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. 24 గంటల్లో కొత్తగా 887 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ ప్రభావంతో మరో నలుగురు మృత్యువాతపడ్డారు. 337 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,551 యాక్టివ్ కేసులున్నాయని తెలిపింది వైద్య ఆరోగ్య శాఖ. లెటెస్ట్‌గా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 201, మేడ్చల్‌లో 79, నిర్మల్‌లో 78, రంగారెడ్డిలో 76, జగిత్యాల జిల్లాలో 56 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి.
ఏపీలో కూడా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. అయితే భారీగా కరోనా కేసులు పెరుగుతుండడంతో గుంటూరుజిల్లా భట్టిప్రోలులో ఆంక్షలు విధించారు. ఒక్క రోజే భట్టిప్రోలులో 70 కరోనా కేసులు నమోదయ్యయి. ఆంక్షలు కఠినంగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఉదయం 7 నుంచి 11 గంటల వరకే నిత్యవసర వస్తువుల కొనుగోలు చేయాలని సూచించారు. వారం రోజుల పాటు ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు అధికారులు.
కరోనా సెకండ్ వేవ్ ఉధృత రూపం దాల్చకముందే ప్రతీ ఒక్కరూ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. గుంటూరు కార్పొరేషన్‌లో కొత్త పాలక మండలి ఆధ్వర్యంలో వ్యాక్సిన్‌పై ఉన్న అపొహలు తొలగిస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.
ఇవి కూడా చదవండి: Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ను ప్రకటించిన కేంద్రం