తమిళనాడులో రోజురోజుకు పెరుగుతున్న కేసుల సంఖ్య..

తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీంతో రాష్ట్ర ప్రజలు భయంగుప్పిట్లో వణికిపోతున్నారు. తాజాగా ఆదివారం తమిళనాడు ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారం.. అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వందల కేసులకు చేరువలో ఉంది. ఆదివారం ఒక్కరోజే 105 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 1477కు చేరింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక 46మంది కరోనా […]

తమిళనాడులో రోజురోజుకు పెరుగుతున్న కేసుల సంఖ్య..

Edited By:

Updated on: Apr 19, 2020 | 9:00 PM

తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీంతో రాష్ట్ర ప్రజలు భయంగుప్పిట్లో వణికిపోతున్నారు. తాజాగా ఆదివారం తమిళనాడు ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారం.. అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వందల కేసులకు చేరువలో ఉంది. ఆదివారం ఒక్కరోజే 105 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 1477కు చేరింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక 46మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు 411 మంది కరోనాను జయించి డిశ్ఛార్జ్‌ అయ్యారు. అయితే ఈ కేసుల్లో ఎక్కువగా మర్కజ్‌ తబ్లీఘీ జమాత్ సమావేశాలకు హాజరైన వారి ద్వారా వచ్చినవే ఎక్కువగా ఉన్నట్లు అధికారులు ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పెరుగుతున్న పాజిటివ్ కేసుల సంఖ్యను గమనిస్తే.. లాక్‌డౌన్‌ సడలింపు అనేది జరగదని తెలుస్తోంది. ప్రభుత్వం మరికొద్ది రోజులు లాక్‌డౌన్‌ కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.