తమిళనాడులో తాజాగా మరో 3,713 పాజిటివ్ కేసులు.. 68 మంది మృతి..

| Edited By:

Jun 27, 2020 | 7:21 PM

తమిళనాడులో కరోనా విలయ తాండవం కొనాసాగుతోంది. శనివారం నాడు కొత్తగా మరో 3,713 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

తమిళనాడులో తాజాగా మరో 3,713 పాజిటివ్ కేసులు.. 68 మంది మృతి..
Follow us on

తమిళనాడులో కరోనా విలయ తాండవం కొనాసాగుతోంది. శనివారం నాడు కొత్తగా మరో 3,713 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 78,335కి చేరింది. నిత్యం వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో.. స్థానిక ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 33,213 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తమిళనాడు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి రాష్ట్ర వ్యాప్తంగా 68 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి 1025 మంది మరణించారు. ఇక కరోనా నుంచి ఇప్పటి వరకు 44,094 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.