పలాస ఘటనలో ఇద్దరు అధికారులపై వేటు

|

Jun 27, 2020 | 1:00 AM

Suspension of Two Officers : శ్రీకాకుళం అమానవీయ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు కారణమైన ఇద్దరు అధికారులపై వేటు వేసింది. కరోనాతో మ‌ృతి చెందిన వ్యక్తి అంత్యక్రియల ఉదంతం సీఎం కార్యాలయం అధికారుల ద‌ృష్టికి వచ్చింది. దీంతో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌తో సీఎంఓ అధికారులు ఫోన్ లో మాట్లాడారు. వివరాలను అడిగి తెలుసుకున్నారు. కరోనా వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రోటోకాల్ ఉన్నప్పటికీ … నిబంధనలు ఉల్లంఘించి పొక్లెయిన్ ద్వారా […]

పలాస ఘటనలో ఇద్దరు అధికారులపై వేటు
Follow us on

Suspension of Two Officers : శ్రీకాకుళం అమానవీయ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు కారణమైన ఇద్దరు అధికారులపై వేటు వేసింది. కరోనాతో మ‌ృతి చెందిన వ్యక్తి అంత్యక్రియల ఉదంతం సీఎం కార్యాలయం అధికారుల ద‌ృష్టికి వచ్చింది. దీంతో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌తో సీఎంఓ అధికారులు ఫోన్ లో మాట్లాడారు. వివరాలను అడిగి తెలుసుకున్నారు. కరోనా వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రోటోకాల్ ఉన్నప్పటికీ … నిబంధనలు ఉల్లంఘించి పొక్లెయిన్ ద్వారా మ‌ృతదేహాన్ని తరలించడం దారుణం అని మండిపడినట్లుగా తెలుస్తోంది. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నివాస్‌ను ఆదేశించారు. వెంటనే రంగంలోకి దిగిన కలెక్టర్.. ఈ ఘటనపై విచారణ జరిపి పలాస మున్సిపల్ కమిషనర్ టి. నాగేంద్రకుమార్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఎన్.రాజీవ్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.