వలస కార్మికుల వెతలపై పిటిషన్.. విచారణ జరపనున్న సుప్రీంకోర్టు

| Edited By: Pardhasaradhi Peri

Mar 30, 2020 | 2:39 PM

లాక్ డౌన్ కారణంగా దేశంలో వేలాది మంది వలస కూలీలు, కార్మికులు, శ్రామికులు పనులు లేక వివిధ నగరాల నుంచి తమ తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో..ఓ గందరగోళ పరిస్థితి ఉత్పన్నమైంది.

వలస కార్మికుల వెతలపై పిటిషన్.. విచారణ జరపనున్న సుప్రీంకోర్టు
Follow us on

లాక్ డౌన్ కారణంగా దేశంలో వేలాది మంది వలస కూలీలు, కార్మికులు, శ్రామికులు పనులు లేక వివిధ నగరాల నుంచి తమ తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో..ఓ గందరగోళ పరిస్థితి ఉత్పన్నమైంది. వారి బతుకులు ప్రశ్నార్థకంగా మారాయి. కరోనా నివారణకు ప్రభుత్వం ప్రకటించిన 21 రోజుల లాక్ డౌన్ కారణంగా రైళ్లు గానీ, బస్సులు గానీ లేక వీరంతా  వీధినపడ్డారు. వీరిలో మహిళలు, వృధ్ధులు, అనారోగ్యం బారిన పడినవారు ఉన్నారు. పొట్ట చేతబట్టుకుని ఈ అభాగులు వందలాది కిలోమీటర్ల దూరం మేర నడిచి వెళ్తున్నారు. వీరికి ఆహారంగానీ, నీరు గానీ, నిలువనీడ గానీ లేదని, వీరి పరిస్థితి దారుణంగా ఉందంటూ అలోక్ శ్రీవాత్సవ్ అనే లాయర్ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. వీరిని ఆదుకోవలసిందిగా కేంద్రాన్ని, రాష్ట్రాలను ఆదేశించాలని ఆయన అభ్యర్థించారు. పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బడుగు జీవులను వారి వారి సొంత ప్రదేశాలకు చేర్చేందుకు బస్సులను ఏర్పాటు చేసినప్పటికీ.. కరోనా వైరస్ మరింత ప్రబలుతుందేమోనన్న ఉద్దేశంతో కేంద్రం వెంటనే ఆ బస్సు సర్వీసులను రద్దు చేసింది. ఆయా రాష్ట్రాలు తమ సరిహద్దులను మూసివేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ పిటిషన్ పై సీజెఐ ఎస్.ఏ.బాబ్డే   ఆధ్వర్యాన గల ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ విచారణ జరపనుంది.