ఇండియాలో చిక్కుబడిన విదేశీయుల తరలింపునకు గైడ్ లైన్స్

| Edited By: Pardhasaradhi Peri

May 25, 2020 | 2:10 PM

లాక్ డౌన్ కారణంగా ఇండియాలో చిక్కుబడిన విదేశీయుల తరలింపునకు కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసింది. కొత్త ప్రామాణిక సూత్రాల ప్రకారం.. ఇలాంటి విదేశీయులంతా పౌర విమాన యన మంత్రిత్వ శాఖకు లేదా సంబంధిత ఏజెన్సీలకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.

ఇండియాలో చిక్కుబడిన విదేశీయుల తరలింపునకు గైడ్ లైన్స్
Follow us on

లాక్ డౌన్ కారణంగా ఇండియాలో చిక్కుబడిన విదేశీయుల తరలింపునకు కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసింది. కొత్త ప్రామాణిక సూత్రాల ప్రకారం.. ఇలాంటి విదేశీయులంతా పౌర విమాన యన మంత్రిత్వ శాఖకు లేదా సంబంధిత ఏజెన్సీలకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. అయితే వారు ఆయా దేశాల పౌరసత్వం పొంది ఉండడమే గాక.. తమ దేశ ఏడాది కాల వీసా లేక,,గ్రీన్ కార్డు, లేదా ఓసీఐకార్డు హోల్డర్లయి ఉండాలి.. మెడికల్ ఎమర్జెన్సీ అయితే భారతీయులు కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు.  వీరి వీసాకు ఆరు నెలల కాల పరిమితి ఉండాలి.. వివిధ దేశాల్లో చిక్కుబడిన భారతీయులను స్వదేశానికి తరలించేందుకు ఉద్దేశించిన నాన్-షెడ్యూల్డ్ విమానాల్లోనే వీరు కూడా ప్రయాణించవలసి ఉంటుంది. ఈ ప్రయాణికులు తమ విమాన ఖర్చులను తామే భరించుకోవలసి ఉంటుంది. విమానాలు ఎక్కే ముందు తప్పనిసరిగా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందని కూడా ఈ గైడ్ లైన్స్ లో పేర్కొన్నారు. ఇక అందరికీ మాస్కులు తప్పనిసరి !