Covid End: తెలంగాణ‌ క‌రోనా థ‌ర్డ్ వేవ్ ముగిసింది.. ఎలాంటి ఆంక్షలు లేవు.. కీలక ప్రకటన చేసిన డీహెచ్ శ్రీనివాస్

|

Feb 08, 2022 | 2:18 PM

తెలంగాణలో కోవిడ్ థర్డ్ వేవ్ ముగిసిందని రాష్ట్ర ప్ర‌జారోగ్య సంచాల‌కులు శ్రీనివాస్ రావు ప్రకటించారు. ఇక వర్క్‌ ఫ్రంహోం అక్కర్లేదన్నారు. ఐటీ సంస్థ‌లు వ‌ర్క్ ఫ్రం హోం విర‌మించుకోవ‌చ్చని సూచించారు. అన్ని సంస్థ‌లు..

Covid End: తెలంగాణ‌ క‌రోనా థ‌ర్డ్ వేవ్ ముగిసింది.. ఎలాంటి ఆంక్షలు లేవు.. కీలక ప్రకటన చేసిన  డీహెచ్ శ్రీనివాస్
Dr G Srinivasa Rao
Follow us on

Covid Third Wave End: తెలంగాణలో కోవిడ్ థర్డ్ వేవ్ ముగిసిందని రాష్ట్ర ప్ర‌జారోగ్య సంచాల‌కులు శ్రీనివాస్ రావు ప్రకటించారు. మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ కరోనా మూడు వేవ్‌ల రూపంలో ప్రపంచాన్ని పట్టి పీడించిందన్నారు. తెలంగాణలో కరోనా పాజిటివీటి రేటు రెండు శాతం మాత్రమే ఉందని అన్నారు. వారం రోజుల్లో వంద‌లోపే కేసులు న‌మోదు అవుతాయ‌న్నారు. టీకా తీసుకున్న వారిలో ప్ర‌భావం త‌క్కువ‌గా ఉంద‌న్నారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 2 శాతం కంటే త‌క్కువ‌గా ఉంద‌న్నారు. అత్య‌ధిక పాజిటివిటీ రేటు 5 శాతానికి వెళ్లింద‌న్నారు. ఫీవ‌ర్ స‌ర్వే ద్వారా ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు ఇంటింటికీ వెళ్లి కిట్లు అంద‌జేశార‌ని వెల్లడించారు.

ఫస్ట్ వేవ్ 10 నెలలు, సెకండ్ వేవ్ 6 నెలలు, థర్డ్ వేవ్ మూడు నెలలు మాత్రమే ఉందని ప్రకటించారు. ఇక ముందు తెలంగాణలో ఎలాంటి ఆంక్షలు అక్కర్లేదన్నారు. కేంద్రం కూడా ఆంక్షలు ఎత్తివేసిందని డీహెచ్ శ్రీనివాస్ రావు వెల్లడించారు.

కరోనాతో రెండేండ్లుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామ‌ని డీహెచ్ శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. ఇక వర్క్‌ ఫ్రంహోం అక్కర్లేదన్నారు. ఐటీ సంస్థ‌లు వ‌ర్క్ ఫ్రం హోం విర‌మించుకోవ‌చ్చని సూచించారు. అన్ని సంస్థ‌లు వంద శాతం ప‌ని చేయ‌వ‌చ్చని స్పష్టం చేశారు. ఉద్యోగులు పూర్తి సంఖ్య‌లో కార్యాల‌యాల‌కు వెళ్లొచ్చన్నారు. ఇప్పటికే రాష్ట్రం పరిధిలో నడుస్తున్న విద్యాసంస్థ‌ల‌ను పూర్తిగా ప్రారంభించామ‌ని వెల్లడించారు.

ఎన్ని వేరియంట్లు వచ్చినా ఎదుర్కోగలమని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పట్లో కొత్త వేరియంట్లు వచ్చే అవకాశం లేదన్నారు. వ్యాక్సిన్‌తోనే కరోనాను సమర్థంగా ఎదుర్కొన్నామన్నారు. కేసులు తగ్గినా ఫీవర్ సర్వే కొనసాగుతుందన్నారు. కరోనాను సీజనల్ ఫ్లూగా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని డీహెచ్‌ శ్రీనివాస్ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి: