శ్రీకాకుళంలో వినూత్న ప్రయోగం.. వాట్సాప్‌లో గణేష్ లడ్డూ వేలం

| Edited By:

Aug 25, 2020 | 12:02 PM

కోవిడ్ మహమ్మారి కారణంగా చవితి ఉత్సవాలు నిరాడంబరంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ ఏడాది ప్రజలు ఇళ్లల్లోనే వినాయక చవితి జరుపుకున్నారు. ఇక ఆలయాల్లో కూడా గణేష్ ఉత్సవాలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. ఈ సారి జరిగే ఉత్సవాల్లో లడ్డూల వేలం..

శ్రీకాకుళంలో వినూత్న ప్రయోగం.. వాట్సాప్‌లో గణేష్ లడ్డూ వేలం
Follow us on

కోవిడ్ మహమ్మారి కారణంగా చవితి ఉత్సవాలు నిరాడంబరంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ ఏడాది ప్రజలు ఇళ్లల్లోనే వినాయక చవితి జరుపుకున్నారు. ఇక ఆలయాల్లో కూడా గణేష్ ఉత్సవాలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. ఈ సారి జరిగే ఉత్సవాల్లో లడ్డూల వేలం నిర్వహించరాదని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు పేర్కొన్న విషయం తెలిసిందే. ఎందుకుంటే.. ప్రజలంతా ఒకే చోట చేరితే.. కరోనా వైరస్ వ్యాప్తి జరిగే ప్రమాదం ఉంది. దీంతో శ్రీకాకుళంలో వినూత్నంగా వినాయకుడి లడ్డూని వేలం పాడారు. శ్రీకాకుళంలోని మొండేటి వీధి లక్ష్మీ గణపతి ఆలయంలో లడ్డూను వాట్సాప్ గ్రూప్ ద్వారా వేలం నిర్వహించారు. నలుగురు వ్యక్తులు కలిసి రూ.1.03 లక్షలకు స్వామి వారి లడ్డూను దక్కించుకున్నారు. వాట్సాప్ ద్వారా వేలం నిర్వహించడం కొత్తగా ఉందని, కోవిడ్ మహామ్మరి దృష్ట్యా ఇలా చేయాల్సి వచ్చిందని లక్ష్మీ గణపతి ఆలయ అధికారులు తెలిపారు. కాగా ప్రస్తుతం ఈ న్యూస్ ఆ నోటా ఈ నోటా పాకి వైరల్‌గా మారింది. ఇది విన్న జనం ఇదేదో బాగుందని అభిప్రాయ పడుతున్నారు.

Read More:

బిగ్‌బాస్-4 ఎంట్రీపై నటుడు నందు క్లారిటీ

పెరగనున్న మొబైల్ చార్జీల ధరలు!

ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ ఉధృతి.. 2.38 కోట్లకి చేరిన కేసులు

డబ్బులు కావాలంటే కాల్ చేయండి.. ఏటీఎం ఇంటికే వచ్చేస్తుంది