Covid-19 deaths: ఆ ఆరు రాష్ట్రాల్లోనే 70 శాతం కరోనా మరణాలు.. అత్యధికంగా ఏ రాష్ట్రంలో నమోదయ్యాయంటే..?

|

Jun 02, 2021 | 4:12 PM

India's Covid-19 deaths: దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. నిత్యం లక్షలాది మంది ఈ మహమ్మారి బారిన పడుతుండగా.. వేలాది మంది ప్రాణాలు

Covid-19 deaths: ఆ ఆరు రాష్ట్రాల్లోనే 70 శాతం కరోనా మరణాలు.. అత్యధికంగా ఏ రాష్ట్రంలో నమోదయ్యాయంటే..?
India Covid-19 Deaths
Follow us on

India’s Covid-19 deaths: దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. నిత్యం లక్షలాది మంది ఈ మహమ్మారి బారిన పడుతుండగా.. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే.. ఇటీవల కాలంలో భారీగా పెరిగిన కేసులు కాస్త.. కొంత తగ్గుముఖం పట్టాయి. కాగా మరణాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో కరోనా మహమ్మారి కారణంగా నమోదవుతున్న మరణాల్లో 70 శాతానికి పైగా ఆరు రాష్ట్రాల్లోనే నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. దేశంలో అత్యధికంగా మహారాష్ర్ట, ఆ తర్వాత తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఉత్తర్‌ ప్రదేశ్‌, పశ్చిమ్‌ బెంగాల్‌ రాష్ట్రాల్లోనే ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

ఇటీవల పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నా.. మరణాల సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తోందని అధికారులు పేర్కొంటున్నారు. మంగళవారం దేశవ్యాప్తంగా 3,207 మంది మహమ్మారికి బలయ్యారు. వారిలో మహారాష్ట్రలో 854 మంది, తమిళనాడులో 490, కర్ణాటకలో 464, కేరళలో 194, ఉత్తర్‌ ప్రదేశ్‌లో 175, పశ్చిమ్ బెంగాల్‌లో 137 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 3,35,102 మంది కరోనాతో చనిపోయారు.

ఇదిలాఉంటే.. నిన్న దేశంలో కొత్త‌గా 1,32,788 కేసులు న‌మోద‌య్యాయి. తాజాగా నమోదైన కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకూ 2,83,07,832 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 2,31,456 మంది వ్యాధి బారినుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 17,93,645 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Also Read:

Doctor Assault: కోవిడ్ కేర్ సెంటర్‌లో యువ వైద్యుడిపై దాడి.. 24 మంది అరెస్ట్.. వీడియో

స్మోకింగ్ తో కోవిద్ కి లింక్ ! పొగ రాయుళ్లూ ! బీ అలర్ట్ అంటున్న మీరట్ డాక్టర్లు , ముంచుకొస్తున్న థర్డ్ వేవ్ తో కూడా ముప్పే అంటూ హెచ్చరికలు