కరోనా నేపథ్యంలో చైనీయులపై మండిపడ్డారు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్. ఏది పడితే అది తిని చైనీయులు ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గబ్బిలాలు, కుక్కలు, పాములు, పిల్లులు, ఎలుకలను ఎలా తింటారని.. వాటి రక్తం, వ్యర్థాలను సైతం ఆహారంగా తీసుకునే చైనీయులను చూస్తుంటే కోపం వస్తోందని అక్తర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనాలో విజృంభించిన కరోనా వలన ఇప్పుడు ప్రపంచంలోని చాలా దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఓ చట్టం తీసుకురావాలని ఆయన సూచించారు.
చైనాపై తనకేం వ్యతిరేకత లేదని.. కానీ జంతువుల పట్ల అంత క్రూరంగా వ్యవహరించడం తగదని హితవు పలికారు. గబ్బిలాలు, కప్పలు, పాములు, కుక్కలు తినడం మా సంస్కృతిలో భాగమని చైనీయులు అనొచ్చు. కానీ ఆ సంస్కృతే మీకు తీవ్రమైన నష్టాన్ని మిగిల్చింది కదా అని షోయబ్ చెప్పుకొచ్చారు. కోవిడ్ ప్రభావం క్రీడలపైనా పడిందని ఆయన అన్నారు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్‌లో షోయబ్ తెలిపారు. కాగా కరోనా నేపథ్యంలో పాకిస్థాన్‌లో జరుగుతోన్న పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) సందిగ్దంలో పడగా.. పీఎస్ఎల్ షెడ్యూల్‌ను కుదించిన విషయం తెలిసిందే.
Read This Story Also: హమ్మయ్య.. క్రికెటర్‌కు కరోనా లేదు..!