లాక్‌డౌన్ ఎఫెక్ట్ః ఏడుగురి మ‌ధ్య‌నే ముచ్చ‌ట‌గా మూడు ముళ్లు

|

Apr 10, 2020 | 2:22 PM

క‌రోనా నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్ర‌క‌టించింది కేంద్రం. దీంతో ప్ర‌జ‌లంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ప్రాణాంత‌క మ‌హ‌మ్మారి వైర‌స్ విజృంభిస్తున్న త‌రుణంలో  నియంత్ర‌ణ‌కు సామాజిక దూరం ఒక్క‌టే మార్గం అని చెబుతున్నారు. దీంతో ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు త‌ప్ప‌టం లేదు. ఇక పెళ్లిల కోసం ముహూర్తాలు పెట్టుకున్న‌వాళ్లు చాలా మంది వాయిదా వేసుకుంటున్నారు. మ‌రికొంద‌రు ఉన్నంత‌లో కానిచ్చేస్తున్నారు. విశాఖ‌ప‌ట్నంలోనూ రెండు పెళ్లిళ్లు అంతే సింపుల్‌గా పూర్తి చేశారు. వివ‌రాల్లోకి వెళితే… విశాఖ‌ప‌ట్నం జిల్లా అన‌కాప‌ల్లి..గవరపాలెంలో పెళ్లి కొడుకు మహేశ్‌తో పాటు […]

లాక్‌డౌన్ ఎఫెక్ట్ః ఏడుగురి మ‌ధ్య‌నే ముచ్చ‌ట‌గా మూడు ముళ్లు
Follow us on
క‌రోనా నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్ర‌క‌టించింది కేంద్రం. దీంతో ప్ర‌జ‌లంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ప్రాణాంత‌క మ‌హ‌మ్మారి వైర‌స్ విజృంభిస్తున్న త‌రుణంలో  నియంత్ర‌ణ‌కు సామాజిక దూరం ఒక్క‌టే మార్గం అని చెబుతున్నారు. దీంతో ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు త‌ప్ప‌టం లేదు. ఇక పెళ్లిల కోసం ముహూర్తాలు పెట్టుకున్న‌వాళ్లు చాలా మంది వాయిదా వేసుకుంటున్నారు. మ‌రికొంద‌రు ఉన్నంత‌లో కానిచ్చేస్తున్నారు. విశాఖ‌ప‌ట్నంలోనూ రెండు పెళ్లిళ్లు అంతే సింపుల్‌గా పూర్తి చేశారు. వివ‌రాల్లోకి వెళితే…
విశాఖ‌ప‌ట్నం జిల్లా అన‌కాప‌ల్లి..గవరపాలెంలో పెళ్లి కొడుకు మహేశ్‌తో పాటు ఏడుగురు, తాకాశి వీధిలో పెళ్లికొడుకు ఈశ్వరరావుతో పాటు ఏడుగురు మాత్రమే ఉండేటట్లు పెళ్లి తతంగం పూర్తి చేశారు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, వారి తల్లిదండ్రులు, పెళ్లి చేసే పురోహితుడు మాత్రమే ఉండేటట్లు కేవలం ఏడుగురితో రెండు వివాహ వేడుక‌లు జ‌రిగాయి.  కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ అమల్లో ఉండగా పరిమితమైన జనం అంటే కేవలం ఏడుగురితోనే పెళ్లి తతంగం పూర్తి చేసేందుకు అనుమతులు ఉండటంతో తంతుపూర్తి చేశారు కుటుంబీకులు.