సచిన్ పైలట్ కార్యాలయం సీజ్

Sachin Pilot’s office sealed in Jaipur : రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ కార్యాలయంను అధికారులు సీజ్ చేశారు. ఓ వైపు రాజస్థాన్ లో రాజకీయాలు వాడి వేడిగా సాగుతున్న సమయంలో ప్రభుత్వంపై తిరుగుబాటు జండా ఎగురవేసిన ఉప ముఖ్యమంత్రి ఆఫీసును మూసివేయడంతో కొంత గందరగోళానికి గురయ్యారు. అయితే సచిన్ పైలట్ కార్యాలయంలోని ఇద్దరు సిబ్బందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో కార్యాలయాన్ని అధికారులు సీజ్ చేశారు. అక్కడ పూర్తి శానిటైజేషన్ నిర్వహించిన […]

సచిన్ పైలట్ కార్యాలయం సీజ్

Updated on: Jul 13, 2020 | 11:53 AM

Sachin Pilot’s office sealed in Jaipur : రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ కార్యాలయంను అధికారులు సీజ్ చేశారు. ఓ వైపు రాజస్థాన్ లో రాజకీయాలు వాడి వేడిగా సాగుతున్న సమయంలో ప్రభుత్వంపై తిరుగుబాటు జండా ఎగురవేసిన ఉప ముఖ్యమంత్రి ఆఫీసును మూసివేయడంతో కొంత గందరగోళానికి గురయ్యారు. అయితే సచిన్ పైలట్ కార్యాలయంలోని ఇద్దరు సిబ్బందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో కార్యాలయాన్ని అధికారులు సీజ్ చేశారు. అక్కడ పూర్తి శానిటైజేషన్ నిర్వహించిన తరువాతే తిరిగి కార్యాలయం తెరుచుకుంటుందని వారు తెలిపారు.

ఇదిలావుంటే.. 30 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు లేవనెత్తిన పార్టీ సీనియర్ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. పార్టీ అధిష్ఠానాన్ని కలుసుకోవాలని ఆయన భావించినప్పటికీ.. ఆ అవకాశం ఆయనకు రాలేదు. దీంతో రాజస్థాన్ రాజకీయాలు ఢిల్లీ చుట్టు తిరుగుతున్నాయి.

Follow Us