కరోనాతో మృతి చెందిన వారికి రూ.4 లక్షల పరిహారం

| Edited By:

Mar 16, 2020 | 6:13 PM

ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా 110 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనను వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్..

కరోనాతో మృతి చెందిన వారికి రూ.4 లక్షల పరిహారం
Follow us on

ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా 110 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనను వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. కరోనాతో మృతి చెందిన వారికి రూ.4 లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించారు. అలాగే.. ఈ వైరస్ బారిన పడిన రోగులకు.. ఉచితంగా ట్రీట్‌మెంట్ అందిస్తామని ఆయన తెలిపారు. ‘ముఖ్యమంత్రి చికిత్స సహాయత కోశ్ యోజన’ కింద కరోనా బాధితులకు చికిత్స అందిస్తామని సోమవారం అసెంబ్లీలో తెలిపారు. ఈ మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రిలీజ్’ చేస్తామని చెప్పారు.

కాగా.. కరోనాను ఎదుర్కునేందుకు అవగాహనే కీలకమన్నారు. కరోనా బాధితుల సంఖ్య పెరగడం చూసి ఎవ్వరూ ఆందోళన చెందాల్సి అవసరం లేదని, వారికి ప్రత్యేకమైన చికిత్స అందిచడం ద్వారా కోలుకుంటున్నారని తెలిపారు. ఈ వైరస్‌ని ఎదుర్కునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని చెప్పారు. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు భారత్-నేపాల్ సరిహాద్దుల్లోని 49 ప్రాంతాల్లో స్క్రీనింగ్ ప్రక్రియ కొనసాగుతున్నట్లు అసెంబ్లీలో పేర్కొన్నారు సీఎం నితీశ్ కుమార్.

Read More this also: సీఎం జగన్‌పై నాగబాబు సెటైర్స్!

సిల్వర్ స్క్రీన్‌పై ‘కరోనా’ మూవీ

ఫ్లూ, జలుబు, కరోనాల మధ్య తేడాలు ఇవే!

రోజా టైమింగ్‌కి దిమ్మ తిరగాల్సిందే!

అవకాశం కోసం వెళ్తే.. ఓ నిర్మాత పడకగదికి రమ్మన్నాడు: హీరోయిన్ సంచలన కామెంట్స్..