షాకింగ్.. కరోనాతో మహిళలకే ముప్పు ఎక్కువట..!

కరోనా వైరస్ వలన పురుషులకే ఎక్కువగా ముప్పు ఉంటుందని ఆ మధ్యన ఓ సర్వే వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్ వలన భారత్‌లో మహిళలకే ఎక్కువ ముప్పు ఉందని తాజాగా ఓ సర్వేలో తేలింది.

షాకింగ్.. కరోనాతో మహిళలకే ముప్పు ఎక్కువట..!

Edited By:

Updated on: Jun 13, 2020 | 3:01 PM

కరోనా వైరస్ వలన పురుషులకే ఎక్కువగా ముప్పు ఉంటుందని ఆ మధ్యన ఓ సర్వే వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్ వలన భారత్‌లో మహిళలకే ఎక్కువ ముప్పు ఉందని తాజాగా ఓ సర్వేలో తేలింది. మే 20 వరకు భారత్‌లో నమోదైన కరోనా కేసులు, మృతుల సంఖ్యను పరిగణలోకి తీసుకున్న శాస్త్రవేత్తలు ఈ వివరాలను వెల్లడించారు. అందులో కరోనా వలన పురుషుల్లో మరణాల శాతం 2.9 శాతంగా ఉండగా.. పురుషుల్లో ఆ శాతం 3.3గా ఉంది. దేశంలో కరోనా సోకిన వారిలో ఎక్కువగా పురుషులే ఉన్నప్పటికీ.., మరణిస్తున్న వారిలో మహిళలే ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. ఇక వృద్ధులకు కరోనా సోకితే మరణించే అవకాశం కాస్త ఎక్కువగానే ఉందని వారు హెచ్చరించారు. అందుకే వృద్ధుల విషయంలో ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ చూపించాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే మహిళల విషయంలోనూ దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. కాగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షలు దాటేసిన విషయం తెలిసిందే.

Read This Story Also: Breaking: పాక్‌ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీకి కరోనా పాజిటివ్..!