మహారాష్ట్రలో మృత్యు ఘంటికలు

మహారాష్ట్రలో మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. కరోనా వైరస్ విజృంభణతో రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. అదే స్థాయిలో భారీగా మరణాలు చోటు చేసుకున్నాయి. మహారాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. నిన్న(27మే) ఒక్క రోజే ఏకంగా 2190 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. 964 మంది రోగులు డిశ్చార్జి కాగా.. మరో 105 మంది మరణించారు. తాజా కేసులతో కలిపి మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 56,948కి చేరింది. కరోనా […]

మహారాష్ట్రలో మృత్యు ఘంటికలు

Updated on: May 28, 2020 | 7:21 AM

మహారాష్ట్రలో మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. కరోనా వైరస్ విజృంభణతో రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. అదే స్థాయిలో భారీగా మరణాలు చోటు చేసుకున్నాయి. మహారాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. నిన్న(27మే) ఒక్క రోజే ఏకంగా 2190 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. 964 మంది రోగులు డిశ్చార్జి కాగా.. మరో 105 మంది మరణించారు. తాజా కేసులతో కలిపి మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 56,948కి చేరింది. కరోనా మహమ్మారితో పోరాడుతూ 1,897 మంది మరణించారు. మహారాష్ట్రలో 37,125 యాక్టిక్ కరోనా కేసులున్నాయి. ఈ రాష్ట్రంలో నమోదైన కేసుల్లో అత్యధికం ముంబైలోనే ఉన్నాయి. బుధవారం (27మే) 1044 కొత్త కేసులు నమోదవడంతో పాటు 32 మంది మరణించారు. దాంతో ముంబైలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 33,835కి చేరింది. కరోనా మహమ్మారితో పోరాడుతూ ఇప్పటి వరకు 1097 మంది మరణించారు.