హనుమాన్‌ చాలీసా చదివితే కరోనా అంతమవుతుందట!

బాబీజీ పాపడ్‌ తింటే కరోనా వైరస్‌ మటుమాయం అవుతుందని కేంద్ర జలవనరుల సహాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌ చెప్పి రెండు రోజులు కాలేదు.. బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌ మరో మహత్తరమైన సలహా ఇచ్చారు. రోజుకు అయిదుసార్లు హనుమాన్‌ చాలీసా..

హనుమాన్‌ చాలీసా చదివితే కరోనా అంతమవుతుందట!

Updated on: Jul 26, 2020 | 12:50 PM

బాబీజీ పాపడ్‌ తింటే కరోనా వైరస్‌ మటుమాయం అవుతుందని కేంద్ర జలవనరుల సహాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌ చెప్పి రెండు రోజులు కాలేదు.. బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌ మరో మహత్తరమైన సలహా ఇచ్చారు. రోజుకు అయిదుసార్లు హనుమాన్‌ చాలీసా చదివితే చాలనీ, కరోనా దరిదాపుల్లోకి కూడా రాదని చెబుతున్నారు ప్రజ్ఞా ఠాకూర్‌. శనివారం ట్విట్టర్‌లో ఆమె కొన్ని సలహాల సూచనలు చేశారు. కరోనాతో పోరాటం సాగించడానికి ప్రజలందరూ వచ్చె నెల అయిదు వరకు రోజుకు అయిదుసార్లు హనుమాన్‌ చాలీసా చదవాలని చెప్పిన ఆమె చివరి రోజు ఇంట్లో దీపాలు వెలిగించి శ్రీరాముడికి హారతి ఇవ్వాలని సూచించారు. దేశ‌వ్యాప్తంగా ఉన్న హిందువులు హ‌నుమాన్ చాలీసాను ఒకే స్వ‌రంలో గానం చేస్తే క‌చ్చితంగా ఫ‌లితం ఉంటుందంటున్నారు ప్రజ్ఞా ఠాకూర్‌. అలా చేస్తే క‌రోనా నుంచి విముక్తి పొందుతామంటున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us