బ్రేకింగ్: ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ కీలక ప్రకటనలు

| Edited By:

Apr 17, 2020 | 11:06 AM

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మరోసారి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక ప్రకటనలు చేశారు. ఇందులో ప్రధానంగా కరోనా లాక్‌డైన్ కారణంగా..

బ్రేకింగ్: ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ కీలక ప్రకటనలు
Follow us on

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మరోసారి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక ప్రకటనలు చేశారు. ఇందులో ప్రధానంగా కరోనా లాక్‌డైన్ కారణంగా స్థూల ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతిన్నదని పేర్కొన్నారు. ఈ క్రమంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు.

శక్తికాంత్ దాస్ కీలక ప్రకటనలు:

1. కరోనా సంక్షోభంలో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు రూన.50 వేల కోట్లతో ఎల్‌టీఆర్‌ఓ 2.0
2. ఆర్బీఐ నిర్ణయంతో ఆర్థిక వ్యవస్థలోకి రూ.50 వేల కోట్లు విడుదల
3. నాబార్డ్, సిడ్బీ, ఎన్‌హెచ్‌బీ వంటి ఆర్థిక సంస్థలకు రుణాల రూపంలో అందజేత
4. రివర్స్ రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గింపు. 4 శాతం నుంచి 3.75 శాతానికి చేరిన ఆర్ఆర్ఆర్
5. రుణ లభ్యత వీలైనంత ఎక్కువగా ఉంచేందుకు చర్యలు
6. ఆర్థిక భద్రత కల్పించేందుకు చర్యలు
7. మార్కెట్లలో పనులు కార్యకలాపాలు పుంజుకునేలా ప్రత్యేకచర్యలు
8. కరోనా సంక్షోభం ఉన్నా సజావుగా కార్యకలాపాలు సాగించేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు చొరవ చూపాలి
9. మార్చిలో వాహనాల ఉత్పత్తి, అమ్మకాలు గణనీయంగా తగ్గిపోయాయి. విద్యుత్ డిమాండ్ భారీగా క్షీణించింది
10. లాక్‌డౌన్ వేళ ఇంర్నెట్, మొబైల్ బ్యాకింగ్ డౌన్‌టైమ్ లేదు. బ్యాంకింగ్ కార్యకలాపాలు సజావుగా సాగుతున్నాయి.
11. ద్రవ్య లభ్యత సరిపడా ఉండేలా చూసేందుకు, రుణ మంజూరు సజావుగా సాగేందుకు, ఆర్థిక ఒత్తిళ్లు తగ్గించేందుకు త్వరలో చర్యలు

Read More:  

రికార్డు సృష్టించిన బంగారం.. రూ. 47 వేలకు చేరువ

పిజ్జా డెలివరీ బాయ్‌కి కరోనా పాజిటివ్

హైదరాబాద్‌లో కరోనా పేషెంట్ అరెస్ట్.. దేశంలోనే ఫస్ట్ టైమ్

లాక్‌‌డౌన్‌ ఎఫెక్ట్: భారీగా తగ్గిన చమురు విక్రయాలు