అత్యాచార నిందితుడు.. మాజీ చర్చ్ ఫాదర్‌కు కరోనా పాజిటివ్‌..

కేరళ నన్‌పై అత్యాచారం చేశాడన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న మాజీ బిషప్ ఫ్రాంకో ములక్కల్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆయన ఇటీవల ఓ కరోనా బాధితుడిని కలుసుకోవడంతో ఆయనకు కూడా కరోనా సోకింది. గతంలో..

అత్యాచార నిందితుడు.. మాజీ చర్చ్ ఫాదర్‌కు కరోనా పాజిటివ్‌..

Edited By:

Updated on: Jul 15, 2020 | 12:08 AM

కేరళ నన్‌పై అత్యాచారం చేశాడన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న మాజీ బిషప్ ఫ్రాంకో ములక్కల్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆయన ఇటీవల ఓ కరోనా బాధితుడిని కలుసుకోవడంతో ఆయనకు కూడా కరోనా సోకింది. గతంలో ఇయన జలందర్‌ చర్చ్‌కు బిషప్‌గా వ్యవహరించారు. ఓ నన్‌పై అత్యాచారం చేసినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేరళలోని కొట్టాయం జిల్లా పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అయితే ఆయన గత కొద్ది రోజుల క్రితం బెయిల్‌పై బయటికి వచ్చాడు. గత కొద్ది రోజులుగా ఆయన కోర్టు వాయిదాలకు హాజరు కాకపోవడంతో ఆగ్రహించిన కోర్టు.. ఆయన బెయిల్‌ను రద్దు చేసింది. వెంటనే నాన్ బెయిలబుల్ వారెంటును కూడా జారీ చేసింది. ఈ క్రమంలో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగగా.. ఆయనకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తేలింది. ఈ విషయాన్ని జలందర్‌ నోడల్‌ ఆఫీసర్‌ ఒకరు తెలిపారు.