
కరోనా ప్రభావంతో దేశం మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. దీంతో చిత్ర పరిశ్రమ మొత్తం షూటింగ్‌లను నిలిపివేసింది. సినీ ప్రముఖులు ఇంటికే పరిమితమైపోయారు. కేవలం సోషల్ మీడియాలో కనిపిస్తూ.. ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేస్తున్నారు. ఇంట్లో కుటుంబ సభ్యులతో ఈ సమయాన్ని హాయిగా గడుపుతున్నారు. తాజాగా గతంలో హరిద్వార్‌లో దిగిన ఓ ఫొటోను రామ్ చరణ్ పోస్ట్ చేశారు. ఆ ఫోటోకు ఆసక్తికరమైన కామెంట్ కూడా జోడించారు. గతంలో హరిద్వార్‌లో తీసుకున్న ఫొటో ఇది. ప్రస్తుతం మనం పరిస్థితులకు తగ్గట్టుగా మసలుకోవడమే. మళ్లీ పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని ఆశిస్తున్నాను. సురక్షితంగా ఉండండి అంటూ చెర్రీ ట్వీట్ చేశాడు.
Throwback – In Haridwar.
Right now going with the flow and hoping that things get back to normal. Stay safe. pic.twitter.com/dDVJFpeNgq
— Ram Charan (@AlwaysRamCharan) June 11, 2020