టాలీవుడ్ స్టార్ హీరోయిన్‏కు కరోనా పాజిటివ్.. క్వారంటైన్‏లోకి వెళ్ళిన రకుల్ ప్రీత్ సింగ్ .. ట్వీట్ వైరల్

కరోనా మహమ్మారి ఇంకా విజృంభిస్తూనే ఉంది. అటు ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు ఈ వైరస్ బారినపడగా తాజాగా టాలీవుడ్ గ్లామర్ హీరోయిన్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్‏కు కరోనా పాజిటివ్.. క్వారంటైన్‏లోకి వెళ్ళిన రకుల్ ప్రీత్ సింగ్ .. ట్వీట్ వైరల్
 గ్రామీణ నేపథ్యంలో రూపొందే ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ విలేజ్ గర్ల్ గా డీ గ్లామర్ రోల్ పోషిస్తోంది. రకుల్ ఆశలన్నీ ఈ సినిమా పైనే..

Updated on: Dec 22, 2020 | 3:07 PM

కరోనా మహమ్మారి ఇంకా విజృంభిస్తూనే ఉంది. అటు ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు ఈ వైరస్ బారినపడగా తాజాగా టాలీవుడ్ గ్లామర్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా కరోనా బారిన పడింది. సినిమా షూటింగ్ కోసం రకుల్ కరోనా టెస్ట్ చేయుంచుకోగా కొవిడ్ పాజిటివ్‏గా వచ్చింది. దీంతో ఈ విషయాన్ని తన ట్విట్టర్ వేదికగా వెల్లడించింది ఈ హీరోయిన్.

“నేను కరోనా పరీక్ష చేయుంచుకున్నాను. అందులో నాకు కొవీడ్19 పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం నా హెల్త్ కండీషన్ బాగానే ఉంది. నేను ప్రస్తుతానికి విశ్రాంతి తీసుకుంటున్నాను. త్వరలోనే తిరిగి షూటింగ్‏లలో పాల్గొంటాను. దయచేసి నన్ను కలిసినవారు అందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను” అంటూ తన ట్విట్టర్‏లో పోస్ట్ చేసింది రకుల్.