రాజస్థాన్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 699 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 64,676కి చేరింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 14,684 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని రాజస్థాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి 908 మంది మరణించారు. కాగా, రాజస్థాన్‌లో అన్‌లాక్ 1.0 ప్రక్రియ తర్వాత కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగాయి. ఇక రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా ఆల్వార్, బికనీర్,జైపూర్ ప్రాంతాల్లోనే నమోదవుతున్నాయి. దీంతో ప్రభుత్వం కరోనా కట్టడి కోసం మరింత కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది.
Rajasthan reports 699 new #COVID19 cases and 10 deaths today. The total number of cases in the State stands at 64,676 and the death toll is at 908. There are 14,684 active cases: State Health Department pic.twitter.com/DWxznLo86x
— ANI (@ANI) August 19, 2020
Read More :