వలస కూలీలపైకి బిస్కట్లు విసిరి.. దుర్భాషలాడి…

యూపీలోని ఫిరోజాబాద్ లో ఓ రైల్వే అధికారి చేసిన పని వీడియోకెక్కింది. శ్రామిక్ రైలులో వెళ్తున్న వలస కూలీలపై ఆయన..బిస్కట్లను   విసురుతూ వారిని దుర్భాషలాడాడు. డీ.కె. దీక్షిత్ అనే ఈ అధికారి తన కొంతమంది ఉద్యోగులతో కలిసి వారిపైకి బిస్కట్లను విసరడమేకాక, వారిని హేళన చేశాడట. అతని వెంట ఉన్న సిబ్బంది కూడా ..తమ అధికారి బర్త్ డే కనుక మీకు  వీటిని ఇస్తున్నాడని వారూ వలస జీవులను ఆట పట్టించారు. మూడు నిముషాల నిడివి […]

వలస కూలీలపైకి బిస్కట్లు విసిరి.. దుర్భాషలాడి...

Edited By:

Updated on: May 31, 2020 | 7:49 PM

యూపీలోని ఫిరోజాబాద్ లో ఓ రైల్వే అధికారి చేసిన పని వీడియోకెక్కింది. శ్రామిక్ రైలులో వెళ్తున్న వలస కూలీలపై ఆయన..బిస్కట్లను   విసురుతూ వారిని దుర్భాషలాడాడు. డీ.కె. దీక్షిత్ అనే ఈ అధికారి తన కొంతమంది ఉద్యోగులతో కలిసి వారిపైకి బిస్కట్లను విసరడమేకాక, వారిని హేళన చేశాడట. అతని వెంట ఉన్న సిబ్బంది కూడా ..తమ అధికారి బర్త్ డే కనుక మీకు  వీటిని ఇస్తున్నాడని వారూ వలస జీవులను ఆట పట్టించారు. మూడు నిముషాల నిడివి గల ఈ వీడియో క్లిప్ అంశం రైల్వే అధికారులకు తెలిసింది. వారు దీక్షిత్ పైన, అతనితో బాటు ఉన్న సిబ్బందిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. గత వారం ఢిల్లీ రైల్వే స్టేషన్ లో వలస కూలీలు ఆహారం, నీటికోసం ఒకరికొకరు కొట్టుకున్నారు. నిజానికి వలస కార్మికుల తరలింపులో ఏకీకృత విధానం ఉండాలని, వారికి అన్ని  వసతులూ కల్పించాలని, ఈ బాధ్యత రాష్ట్రాలతో బాటు కేంద్రంపై కూడా ఉందని సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చింది. కానీ వాటిని ఇవి పాటిస్తున్న దాఖలాలు కనబడడం లేదు.

 

Loading...
Unable to load recommendations.
Follow Us