ప్రభాస్ కోసం.. హైదరాబాద్‌లో ఇటలీ అందాలు

కరోనా ప్రభావంతో మధ్యలో నిలిచిపోయిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చిత్రం మళ్లీ షూటింగ్ శ్రీకారం చుడుతోంది. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో.. పూజా హెగ్డే కథానాయికగా 'పీరియాడికల్ లవ్ స్టోరీ'...

ప్రభాస్ కోసం.. హైదరాబాద్‌లో ఇటలీ అందాలు

Updated on: Jun 23, 2020 | 8:36 AM

కరోనా ప్రభావంతో మధ్యలో నిలిచిపోయిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చిత్రం మళ్లీ షూటింగ్ శ్రీకారం చుడుతోంది. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో.. పూజా హెగ్డే కథానాయికగా ‘పీరియాడికల్ లవ్ స్టోరీ’ తెరకెక్కుతోంది. ఈ చిత్రం కోసం హైదరాబాద్ లోనే ఇటలీ అందాలను సెట్ చేస్తున్నారు. ముందుగా అనుకున్నట్లుగా ఇటలీ, ఆస్ట్రియాలో కీలక సన్నివేశాలను తెరకెక్కిచాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. కానీ కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో విదేశాల్లో షూటింగ్‌కు బ్రేక్ పడింది. దీంతో షూటింగ్ ను ఇక్కడే నిర్వహించాలని నిర్ణయించింది చిత్ర యూనిట్. ఇందుకోసం హైదరాబాద్‌లో ఓ భారీ సెట్టింగ్‌కు ప్లాన్ చేశారు.  ఐదు కోట్ల రూపాయల వ్యయంతో ఓ హాస్పిటల్ సెట్‌ను సిద్దం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

1970-80 కాలం నాటి ఇటలీ అందాలను  ఆవిష్కరిస్తూ ఆర్ట్‌ డైరెక్టర్‌ రవీందర్‌ ఈ సెట్‌ను సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆగష్టు మొదటి వారంలో ఈ సెట్స్‌లో కీలక సన్నివేశాల్ని షూట్ చేస్తారు. ఈ సినిమాకు ‘#రాధేశ్యామ్‌’ అనే టైటిల్‌ ఖరారు చేయబోతున్నట్లు సమాచారం.

ప్రభాస్‌ హీరోగా రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. వంశీ, ప్రమోద్‌ నిర్మాతలు. పూజాహెగ్డే కథానాయిక. యూరప్‌ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్‌ లవ్‌స్టోరీ అని సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో ప్రభాస్ అభిమానుల్లో  భారీ క్రేజ్ నెలకొంది.