బ్రేకింగ్ న్యూస్: ఈ రోజు రాత్రి 8 గంటలకు ప్రధాని మోదీ కీలక ప్రసంగం

ఈ రోజు రాత్రి 8 గంటలకు ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. దీంతో లాక్‌డౌన్ కొనసాగింపుపై ఆయన కీలక ప్రకటన చేసే అవకాశముంది. సోమవారం సీఎంలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో లాక్‌డౌన్‌పై భిన్న అభిప్రాయాలు..

బ్రేకింగ్ న్యూస్: ఈ రోజు రాత్రి 8 గంటలకు ప్రధాని మోదీ కీలక ప్రసంగం

Edited By:

Updated on: May 12, 2020 | 1:04 PM

ఈ రోజు రాత్రి 8 గంటలకు ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. దీంతో లాక్‌డౌన్ కొనసాగింపుపై ఆయన కీలక ప్రకటన చేసే అవకాశముంది. సోమవారం సీఎంలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో లాక్‌డౌన్‌పై భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో.. ఈ రోజు రాత్రి 8 గంటలకు ప్రధాని ప్రసంగం ఆసక్తిని రేకెత్తిస్తోంది. లాక్‌డౌన్‌పై సడలింపులు ఉంటాయా? లేక కొనసాగింపులు ఉంటాయా? అన్నది ఈ రోజు తేలనుంది. దీంతో ఆయన ఏం చెప్పబోతున్నారన్నదానిపై ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.

కాగా నిన్న వీడియో కాన్ఫరెన్స్‌లో అనేక రాష్ట్రాలు తమ తమ డిమాండ్లను కేంద్రం ముందు పెట్టాయి. కొన్ని రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లో లాక్‌డౌన్ పొడిగించాలని అభిప్రాయం వ్యక్తం చేశాయి. అయితే ప్రధాని మోదీ విధించి లాక్‌డౌన్ మే 17వ తేదీ ముగియనుంది. దానికి ఇంకా ఆరు రోజుల సమయం ఉండగానే మోదీ.. అన్ని రాష్ట్రాల సీఎంలతో మాట్లాడారు. అలాగే పలు విషయాలపై కూడా చర్చించారు.

Shri @narendramodi will be addressing the nation at 8 PM this evening.

Read More:

మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. టెన్త్ విద్యార్థులకు వాట్సాప్‌ లెసన్స్

పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

దిల్‌రాజు వెడ్స్ తేజస్విని.. మాతృదినోత్సవం రోజు కొత్త జీవితం