ప్రజలను భయపెట్టొద్దు… కరోనాను అరికట్టేద్దాం.. ముఖ్యమంత్రులకు ధైర్యం చెప్పిన ప్రధాని మోదీ

|

Mar 17, 2021 | 4:14 PM

COVID-19 cases: దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తోందని , రాష్ట్రాలు చాలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు ప్రధాని మోదీ. కరోనా నియంత్రణపై ప్రధాని అన్ని రాష్ట్రాల సీఎంలతో..

ప్రజలను భయపెట్టొద్దు... కరోనాను అరికట్టేద్దాం.. ముఖ్యమంత్రులకు ధైర్యం చెప్పిన ప్రధాని మోదీ
Pm Modi In Meeting With Cms
Follow us on

PM Modi Meeting With Chief Ministers: దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తోందని , రాష్ట్రాలు చాలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు ప్రధాని మోదీ. కరోనా నియంత్రణపై ప్రధాని అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు . టెస్టింగ్‌ , ట్రేసింగ్‌ను పెంచాల్సిన అవసరం ఉందని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ సమావేశానికి బెంగాల్ సీఎం మమత బెనర్జీ, చత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ భాగేల్ గైర్హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ…. అందరూ అత్యంత క్రియాశీలకంగా ఉండాల్సిన సమయం ఇదే అని అన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అవసరమున్న చోట్ల ‘మైక్రో కంటెయిన్మెంట్’ జోన్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలను ఎట్టి పరిస్థితుల్లోనూ భయభ్రాంతులకు గురిచేయవద్దని, అలాంటి వాతావరణాన్ని సృష్టించవద్దని సూచించారు. ముందస్తు జాగ్రత్తలు, మరికొన్ని చర్యలు తీసుకుందామని, అంతేగానీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయవద్దని కోరారు .

కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని..వ్యాక్సినేషన్‌ వేగం పెంచాలని సీఎంలను కోరారు ప్రధాని మోదీ. ఇందుకోసం కేంద్రం నుంచి కావలసిన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు ఇవాల్టితో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రారంభించి రెండు నెలలు పూర్తైంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మూడున్నర కోట్ల డోసులను అందించారు. వ్యాక్సిన్‌ వేస్టేజ్‌ను ఆపాల్సిన అవసరం ఉందన్నారు మోదీ. ఏపీ,తెలంగాణ , ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో 10 శాతం వ్యాక్సిన్‌ వృధా అవుతోందని , అధికార యంత్రాంగం దీనిని అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు మోదీ.

ఐతే ఈ సమావేశానికి బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ గైర్హాజరయ్యారు. మమత ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటం వల్లే ప్రధానితో సమావేశానికి హాజరుకాలేకపోయారని అంటున్నారు ఆమె సన్నిహితులు.

ఇవి కూడా చదవండి : CM KCR speaking Assembly : రైతులకు వంద శాతం రుణమాఫీ చేస్తాం.. ఉభయ సభలనుద్ధేశించి మాట్లాడుతున్న సీఎం కేసీఆర్

ఈ ఆటో డ్రైవర్ మామూలోడు కాదు.. ఒక్క వీడియోతో సినిమాలో ఛాన్స్ పట్టేశాడు.. సెలబ్రిటీ అయిపోయాడు..

పదివేలతో ఈ వ్యాపారం ప్రారంభించండి.. నెలకు లక్షల్లో ఆదాయం సంపాదించండి.. సింపుల్ బిజినెస్..