PM Modi Video Conference: సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్… కరోనా కేసుల నియంత్రణపై చర్చ

సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం ప్రారంభమైంది. కరోనా సెకండ్‌వేవ్‌ విజృంభణతో అప్రమత్తమైన కేంద్రం..అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్‌ సమావేశం..

PM Modi Video Conference: సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్... కరోనా కేసుల నియంత్రణపై చర్చ
Pm Modi

Updated on: Mar 17, 2021 | 2:50 PM

PM Modi-CMs meeting begins: సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం ప్రారంభమైంది. కరోనా సెకండ్‌వేవ్‌ విజృంభణతో అప్రమత్తమైన కేంద్రం..అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్‌ సమావేశం ఏర్పాటుచేసింది. ఐతే ఈ సమావేశానికి బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భగేల్‌ గైర్హాజరైనట్లు తెలుస్తోంది.

బెంగాల్‌లో బీజేపీ వర్సెస్‌ టీఎంసీ ఫైట్‌ పీక్స్‌కు చేరింది. ఇరు వర్గాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మమత కాలికి గాయమైన తర్వాత..డైలాగ్‌ వార్‌ మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో ప్రధాని ఏర్పాటుచేసిన ముఖ్యమంత్రుల సమావేశానికి ఆమె గైర్హాజరయ్యారు. మమతకు బదులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అటెండైనట్లు తెలుస్తోంది. ఐతే మమత ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటం వల్లే ప్రధానితో సమావేశానికి హాజరుకాలేకపోయారని అంటున్నారు ఆమె సన్నిహితులు.

దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో మహమ్మారి కట్టడికి చర్యలు చేపట్టింది కేంద్రం. ఇందులో భాగంగానే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటుచేశారు ప్రధాని మోదీ. వైరస్‌ నియంత్రణకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టాయో అడిగి తెలుసుకోనున్నారు.

ఇవి కూడా చదవండి: ఏపీ మాజీ మంత్రి నారాయణ ఇంట్లో, బంధువుల ఇళ్లల్లో సీఐడీ సోదాలు..ఏకకాలంలో 10 ప్రాంతాల్లో తనిఖీలు

Rs.10 Biryani: ఘుమ ఘుమలాడే హైదరాబాదీ బిర్యానీ రూ.10కే.. ఎక్కడో తెలుసా..!

విద్యార్థుల తల్లిదండ్రుల్లో కొత్త భయం.. దడ పుట్టిస్తున్న కరోనా.. హాట్‌స్పాట్స్‌గా గురుకుల పాఠశాలలు..