బెజవాడలో ప్రైవేటు కోవిడ్ సెంటర్లు రద్దు !

| Edited By:

Sep 04, 2020 | 3:52 PM

కరోనా పేరుతో అమాయకుల్ని దోచుకుంటున్న ప్రయివేట్ ల్యాబ్స్ కు చెక్‌ పడింది. విజయవాడలో నడి రోడ్డుపై కరోనా పేషెంట్లను దోచుకుంటున్న ప్రైవేట్‌ కోవిడ్ సెంటర్ల లైసెన్సులు రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

బెజవాడలో ప్రైవేటు కోవిడ్ సెంటర్లు రద్దు !
Follow us on

కరోనా పేరుతో అమాయకుల్ని దోచుకుంటున్న ప్రయివేట్ ల్యాబ్స్ కు చెక్‌ పడింది. బెజవాడలో నడిరోడ్డుపై దోచుకుంటున్న తీరు టీవీ9 నిఘాలో బయటపడటంతో అధికార యంత్రాంగం కదిలింది. విజయవాడలోని ప్రైవేట్‌ కోవిడ్ సెంటర్ల లైసెన్సులు రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ప్రజల్లో కరోనా భయం మామాలుగా లేదు. కాస్త అనారోగ్యం అనిపించినా మహమ్మారి సోకిందేమో అనే భయం ఇప్పుడు అందరినీ టెన్షన్‌లో పడేస్తోంది. దీంతో ప్రభుత్వం నిర్వహించే టెస్ట్‌ సెంటర్ల దగ్గరకు వెళ్లడానికి ఇబ్బంది పడుతున్న కొందరు.. ప్రైవేటు ల్యాబ్స్‌ను ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రైవేటు డయాగ్నస్టిక్ సెంటర్స్ జనం కరోనా భయాందోళనను క్యాష్ చేసుకుంటున్నాయి. ఎలాంటి అనుమతి లేకున్నా.. కరోనా టెస్ట్ చేస్తామంటూ రోడ్డుపైనే షట్టర్ తెరిచి, జనాన్ని దోచుకుంటున్నాయి. బెజవాడ నడి సెంటర్ లో సాగుతున్న దందాపై టీవీ9 నిఘా పెట్టి.. బట్టబయలు చేసింది.

ఎలాంటి అనుమతి పొందని ప్రైవేటు ల్యాబ్స్ విచ్చలవిడిగా కోవిడ్ పరీక్షల పేరుతో దందా చేస్తున్నాయి. విజయవాడలో వెలిసిన అశ్రిత్ డయాగ్నస్టిక్ సెంటర్ నిర్వాహకులు బరితెగించారు. ఆస్పత్రి బోర్డుపై కొన్ని పరీక్షలే కనిపిస్తున్నా..అన్ని పరీక్షలు చేస్తామంటున్నారు. కరోనా టెస్టులు కూడా చేస్తామని చెబుతున్నారు. టీవీ9 టీం అని తెలియక అడ్డంగా బుక్కయ్యాడు.

కాస్తంతా లోతుగా వివరాలు అడగ్గా బాస్‌కు ఫోన్ చేశాడు. టెస్ట్‌ల కోసం వచ్చారు.. ఫీజుల వివరాలు చెప్పండి అంటూ ఫోన్‌లో అడిగాడు. ఆ సమాచారం అంతా టీవీ9 ప్రతినిధికి చెప్పాడు. విషయం ఏంటంటే టెస్ట్‌లు చేస్తారు కాని.. రిపోర్ట్ ఇవ్వరు. అంతేకాదు, ఈ విషయం బయట చెప్పొద్దని చెబుతున్నారు.

వాస్తవానికి కరోనా టెస్ట్ చేయించాలంటే.. ఆధార్ కార్డ్ సమర్పించాల్సి ఉంటుంది. కాని ఇక్కడ అలాంటివేమి అవసరం లేదని ల్యాబ్ టెక్నీషియన్ అంటున్నాడు. యాంటీజెన్ టెస్ట్ అయితే 2500 రూపాయలు, యాంటీబాడీ టెస్ట్ ఐతే 1600 రూపాయలు తీసుకుంటామని చెప్తున్నాడు.

మొత్తానికి ప్రభుత్వం నుంచి అనుమతి లేకున్నా.. కరోనా టెస్ట్‌లు చేస్తున్నారు. అయితే టీవీ9 లోగో కనపడే సరికి కంగారుపడిపోయాడు. కరోనా టెస్టా.. అబ్బే ఇక్కడ అలాంటివేం చేయడం లేదే అంటూ మాట మార్చే ప్రయత్నం చేశాడు.