వందేళ్లకో అంటు వ్యాధి.. ఇప్పుడు కరోనా వంతు.. వివరాలు ఇవే!

| Edited By:

Mar 02, 2020 | 9:04 PM

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా గడగడలాడిస్తోన్న విషయం తెలిసిందే. ఇలానే.. శతాబ్దానికో అంటు వ్యాధి ప్రపంచాన్ని కుదిపేశాయి. ఇదే ఓ నమ్మికగా మారిపోయింది. అంతేకాదు వీటికి ఆధారాలు కూడా..

వందేళ్లకో అంటు వ్యాధి.. ఇప్పుడు కరోనా వంతు.. వివరాలు ఇవే!
Follow us on

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా గడగడలాడిస్తోన్న విషయం తెలిసిందే. ఇలానే.. శతాబ్దానికో అంటు వ్యాధి ప్రపంచాన్ని కుదిపేశాయి. ఇదే ఓ నమ్మికగా మారిపోయింది. అంతేకాదు వీటికి ఆధారాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం కరోనా వైరస్ మాదిరిగానే 1720, 1820, 1920లలో కూడా ప్రపంచాన్ని అంటువ్యాధులు ప్రభలించడంతో.. కోట్లాది మందిని పొట్టనబెట్టుకున్నాయని పలువురు పరిశోధికులు పేర్కొన్నారు. దీన్నిబట్టి చూస్తుంటే ఎవరో కావాలని ఇలా చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు ‘ఏలియన్ న్యూస్’ అనే వెబ్ మీడియా పేర్కొంది.

శతాబ్దానికి ప్రపంచాన్ని కుదిపేసిన అంటు వ్యాధుల వివరాలు!

1720లో ప్లేగు వ్యాధి:

మీరు ఇప్పటికీ ప్లేగు వ్యాధిని గుర్తుపెట్టుకున్నారా. అంతలా 1720 సంవత్సరంలో ఈ ప్లేగు వ్యాధి సంచలనం సృష్టించింది. ఇది ఎలుకల నుంచి వచ్చిన వ్యాధి. ఇది యూరప్‌లో విజృంభించింది. ఫ్రాన్సులోని మర్సెయిల్స్‌లో బయటపడిన ఈ వ్యాధి ఒక్క ఆ నగరంలోనే 50వేల మందిని బలి తీసుకుంది. క్రమక్రమంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. మొత్తం మీద ఫ్రాన్సు వ్యాప్తంగా లక్షమంది ఈ వ్యాధితో చనిపోయారు.

1820లో కలరా వ్యాధి:

మీరు ఇప్పటికీ కలరా వ్యాధి గురించి ఎక్కడో ఓ చోట వినే ఉంటారు. ప్లేగు వ్యాధికి వందేళ్లు పూర్తవుతుండగానే కలరా ఆసియా దేశాలను కబళించింది. ఫిలిప్పైన్స్, థాయ్ లాండ్, ఇండోనేషియా దేశాల్లో ఈ వ్యాధి కారణంగా లక్షమంది మరణించారు. కలరా బ్యాక్టిరియాతో కలుషితమైన చెరువు నీటిని తాగి ప్రజలు ఈ వ్యాధి బారిన పడ్డారు.

1920లో స్పానిష్ ఫ్లూ:

కలరా వ్యాధి వచ్చి మరో వందేళ్లు పూర్తికాకుండానే.. పరిచయమైన వైరస్.. స్పానిష్ ఫ్లూ. ఏకంగా 100 కోట్ల మంది దీని బారిన పడగా.. ఒక కోటి మంది మృత్యువాతపడ్డారు. మానవజాతి చరిత్రలోనే పెనువిషాదం మిగిల్చిన అతి భయంకర వ్యాధిగా ఈ వైరస్ పేరుగాంచింది.

2020లో కరోనా వైరస్:

స్పానిష్ ఫ్లూ వచ్చిన వందేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు చైనాలో కరోనా వైరస్ విజృంభించింది. రోజురోజుకీ.. ఈ వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరిస్తూనే ఉంది. ఇప్పటికీ ఈ వైరస్ మందు కనిపెట్టలేదు. దీంతో అంతర్జాతీయంగా సమాజాన్ని భయాందోళనలకు గురి చేస్తోంది.