ర్యాపిడ్ టెస్టుల కోసం క్యూ కడుతున్న జనం..

| Edited By:

Jul 21, 2020 | 10:18 AM

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏర్పాటు చేసిన కరోనా టెస్టింగ్ సెంటర్లకు జనం తాకిడి పెరిగింది. హైదరాబాద్‌లో పాజిటివ్‌ కేసులతోపాటు అనుమానితుల సంఖ్య కూడా పెరిగిపోతుండడంతో తమకు కరోనా సోకిందా..? లేదా..? అన్నది నిర్ధారించుకునేందుకు..

ర్యాపిడ్ టెస్టుల కోసం క్యూ కడుతున్న జనం..
Follow us on

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏర్పాటు చేసిన కరోనా టెస్టింగ్ సెంటర్లకు జనం తాకిడి పెరిగింది. హైదరాబాద్‌లో పాజిటివ్‌ కేసులతోపాటు అనుమానితుల సంఖ్య కూడా పెరిగిపోతుండడంతో తమకు కరోనా సోకిందా..? లేదా..? అన్నది నిర్ధారించుకునేందుకు చాలా మంది ప్రజలు పీహెచ్ సీ కేంద్రాల ఎదుట క్యూ కడుతున్నారు. ర్యాపిడ్ టెస్టుల కోసం ఆరోగ్య కేంద్రాల దగ్గర అనుమానితులు బారులు తీరుతున్నారు. పెరుగుతున్న కేసులతోపాటు పీహెచ్ సీల దగ్గరికి జనం భారీగా చేరుకుంటున్నారు. దీంతో చాలా మంది టెస్టుల కోసం పీహెచ్ సీ కేంద్రాల ముందు క్యూ కట్టి ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది.

హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలో మొత్తం 90 టెస్టింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు అధికారులు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే టెస్టుల కోసం జనం ఉదయం 6 గంటల నుంచే క్యూలో నిలుచుంటున్నారు. క్యూ లైన్లలో పెరుగుతున్న రద్దీతో జనం ఆందోళనపడుతున్నారు. అయితే రోజుకు కేవలం 40 మందికి మాత్రమే టెస్టులు చేసే అవకాశం వుందని వైద్య సిబ్బంది చెబుతున్నారు.

Read More:

ఏపీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత..

కరోనా ట్రీట్‌మెంట్ విషయంపై ఏపీ ప్రభుత్వ కీలక మార్గదర్శకాలు..

బ్రేకింగ్: మధ్య ప్రదేశ్ గవర్నర్ మృతి..