కరోనా కట్టడికి రంగంలోకి దిగిన పారామిలటరీ బలగాలు..

దేశంలో మహారాష్ట్ర తర్వాత అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదైందని గుజరాత్‌లోనే. ఈ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. దీనితో మే 7 నుంచి మే 15 వరకు పూర్తిస్థాయి లాక్ డౌన్‌ను పాటించాలని నగర మున్సిపల్ కార్పోరేషన్ నిర్ణయించింది. అత్యవసర సేవలు మినహాయించి మొత్తం అన్నీ మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వాన్ని సాయం కోరగా.. ఐదు కంపెనీల పారామిలటరీ బలగాలు రంగంలోకి దిగాయి. అహ్మదాబాద్, సూరత్‌లలో ఉన్న […]

కరోనా కట్టడికి రంగంలోకి దిగిన పారామిలటరీ బలగాలు..

Updated on: May 08, 2020 | 2:00 PM

దేశంలో మహారాష్ట్ర తర్వాత అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదైందని గుజరాత్‌లోనే. ఈ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. దీనితో మే 7 నుంచి మే 15 వరకు పూర్తిస్థాయి లాక్ డౌన్‌ను పాటించాలని నగర మున్సిపల్ కార్పోరేషన్ నిర్ణయించింది. అత్యవసర సేవలు మినహాయించి మొత్తం అన్నీ మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వాన్ని సాయం కోరగా.. ఐదు కంపెనీల పారామిలటరీ బలగాలు రంగంలోకి దిగాయి.

అహ్మదాబాద్, సూరత్‌లలో ఉన్న కంటైన్మెంట్ జోన్లలో ఈ పారామిలటరీ బలగాలు విధులు నిర్వహిస్తాయని.. రాష్ట్ర సీఎం విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం వీళ్లను స్పెషల్ ఫ్లైట్‌లో పంపిందని గుజరాత్ డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ శివానంద్ ఝా తెలిపారు. అటు రాత్రిపూట కర్ఫ్యూ యధావిధిగా కొనసాగుతుందని.. కఠినమైన నిబంధనలు ప్రజలు ఈ వారం రోజులు ఖచ్చితంగా పాటించాలని ఆయన అన్నారు.

Read More:

మెట్రో సర్వీసుల్లో 50% ఆక్యుపెన్సీ.. సిటీ బస్సుల్లో నో స్టాండింగ్!

కిమ్ మరణం వెనుక అసలు రహస్యమిదే.. దేశద్రోహులు గుర్తింపు.. వారికి చావే గతి!

మందుబాబులకు కిక్కిచ్చే వార్త.. ఇకపై వాటికి చెక్ పడినట్లే!

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. ఇంజనీరింగ్ ఫీజుల జీవో సస్పెండ్..