కోవిడ్-19 : మహహ్మారి ఇప్పుడు ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోంది. పల్లె పట్నం తేడా లేకుండా అంతటా అవహిస్తున్న వైరస్ అన్ని దేశాలను తన ఆధీనంలోకి తెచ్చుకుంటోంది. సాధారణ ప్రజలే కాదు.. దేశాధినేతలు, ఉన్నత స్థాయి నాయకులూ కోవిడ్ బారినపడుతున్నారు. తాజాగా పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ స్పీకర్ అసద్ ఖైజర్‌కు కరోనా వైరస్ సోకింది. కరోనా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. దీంతో పాక్‌ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఇతర ఉన్నతాధికారుల్లో టెన్షన్ నెలకొంది.
కరోనా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో ప్రపంచదేశాలు లాక్‌డౌన్ పాటిస్తున్నాయి. పొరుగు దేశం పాకిస్తాన్‌లోనూ లాక్‌డౌన్ కొనసాగుతోంది. కానీ, అసద్ ఖైజర్ మాత్రం నిబంధనలు ఉల్లంఘించి తన ఇంట్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఆ విందుకు చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ క్రమంలోనే తొలుత అసద్ చెల్లెలు , బావకు కరోనా వైరస్ సోకినట్లుగా తెలిసంది. దీంతో మిగిలిన వారంతా అప్రమత్తమై ..అందరూ కరోనా పరీక్షలు చేయించుకోగా ఖైజర్‌కు, అతడి కూతురు, కొడుకుకి కూడా కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. అంతేకాదు, గత వారమే స్పీకర్ అసద్ ఖైజర్ పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. దీంతో ఇమ్రాన్ ఖాన్‌కు కూడా మరోసారి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు తప్పవంటున్నారు.