పాక్‌ మంత్రికి కరోనా పాజిటివ్..

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటి వరకు దీనికి వ్యాక్సిన్‌ లేకపోవడంతో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షల్లో పెరుగుతోంది. సామాన్యుల నుంచి మొదలుకొని..

పాక్‌ మంత్రికి కరోనా పాజిటివ్..

Edited By:

Updated on: Jul 04, 2020 | 4:35 PM

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటి వరకు దీనికి వ్యాక్సిన్‌ లేకపోవడంతో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షల్లో పెరుగుతోంది. సామాన్యుల నుంచి మొదలుకొని.. ప్రజాప్రతినిధులను, పోలీసులను, వైద్యాధికారులను కూడా తాకుతోంది. అంతేకాదు.. కొన్ని దేశాల్లో ప్రజాప్రతినిధులు, వైద్యాధికారులు కరోనా కాటుతో మరణిస్తున్నారు. తాజాగా పాక్‌ విదేశాంగ శాఖ మంత్రి మహమూద్‌ ఖురేషీ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని శుక్రవారం ఆయనే వెల్లడించారు. అంతేకాదు.. తాను ఇంటి నుంచే అన్ని పనులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గురువారం నాడు కొద్దిగా అస్వస్థతకు గురవ్వడంతో.. తాను స్వీయ నిర్భంధంలోకి వెళ్లిపోయానని.. ఆ తర్వాత కరోనా టెస్టులు చేయించుకోగా.. పాజిటివ్‌ వచ్చిందన్నారు. దేవుడి దయ వల్ల ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని.. మీరంతా కూడా తనకోసం దేవుడిని ప్రార్ధించడంటూ వేడుకున్నారు. ఈ విషయాన్ని ఆయన తన అధికారిక ట్విట్టర్‌లో వెల్లడించారు.

కాగా, పాకిస్థాన్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయాయి. ఇప్పటికే అక్కడ రెండు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని.. మరో నాలుగు వేల మందికి పైగా కరోనా బారినపడి మరణించినట్లు పాక్ ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.