మహారాష్ట్రలో 700 మంది పోలీసులకు కరోనా..

| Edited By: Pardhasaradhi Peri

May 09, 2020 | 4:55 PM

మహారాష్ట్రలో పోలీసులను కూడా కరోనా భూతం తాకింది. సుమారు 700 మందికి పైగా ఖాకీలు ఈ వైరస్ బారిన పడ్డారని, ఐదుగురు మరణించారని రాష్ట్ర పోలీసు శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు తమ శాఖలోనే 648 యాక్టివ్ కేసులు నమోదైనట్టు పేర్కొంది. ఒక్క ముంబైలోనే 55 ఏళ్ళు దాటిన పోలీసులను ఇళ్లలోనే ఉండాల్సిందిగా ఈ శాఖ ఉన్నతాధికారులు కోరారు. ముగ్గురు పోలీసులు ఇటీవల కరోనాతో మరణించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సిటీలో 11 వేలకు పైగా కరోనా […]

మహారాష్ట్రలో 700 మంది పోలీసులకు కరోనా..
Follow us on

మహారాష్ట్రలో పోలీసులను కూడా కరోనా భూతం తాకింది. సుమారు 700 మందికి పైగా ఖాకీలు ఈ వైరస్ బారిన పడ్డారని, ఐదుగురు మరణించారని రాష్ట్ర పోలీసు శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు తమ శాఖలోనే 648 యాక్టివ్ కేసులు నమోదైనట్టు పేర్కొంది. ఒక్క ముంబైలోనే 55 ఏళ్ళు దాటిన పోలీసులను ఇళ్లలోనే ఉండాల్సిందిగా ఈ శాఖ ఉన్నతాధికారులు కోరారు. ముగ్గురు పోలీసులు ఇటీవల కరోనాతో మరణించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సిటీలో 11 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.

కరోనా వైరస్ ట్రాన్స్ మిషన్ చైన్ ని తాము బ్రేక్ చేయలేకపోయామని సీఎం ఉధ్ధవ్ థాక్రే అంగీకరించారు. దయచేసి ఇళ్లలోనే ఉండాలని ఆయన మళ్ళీ మళ్ళీ ప్రజలను కోరారు. లాక్ డౌన్, కరోనా వైరస్ తోనే కలిసి జీవించే పరిస్థితి ఉత్పన్నమైనట్టు ఆయన వ్యాఖ్యానించారు.