పోలీసుల్ని వెంటాడుతున్న కరోనా…20 పీఎస్‌లు మూసివేత

|

Jul 06, 2020 | 7:04 PM

దేశ వ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. బుసలు కొడుతున్న వైరస్ విలయ తాండవం కొనసాగుతోంది. సామాన్యులు మొదలు, ప్రజా ప్రతినిధులు, వైద్యులు, పోలీసులు పెద్ద సంఖ్యలో వైరస్ బారినపడుతున్నారు.

పోలీసుల్ని వెంటాడుతున్న కరోనా...20 పీఎస్‌లు మూసివేత
Follow us on

దేశ వ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. బుసలు కొడుతున్న వైరస్ విలయ తాండవం కొనసాగుతోంది. సామాన్యులు మొదలు, ప్రజా ప్రతినిధులు, వైద్యులు, పోలీసులు పెద్ద సంఖ్యలో వైరస్ బారినపడుతున్నారు. కరోనా కట్టడి కోసం ప్రభుత్వాలు ఎన్ని చర్యలు అమలు చేస్తున్నప్పటికీ వైరస్ విజ‌ృంభణ ఏ మాత్రం తగ్గటం లేదు. కరోనా, లాక్‌డౌన్ కారణంగా అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసులు చాలా మందిని మహమ్మారి వెంటాడి భయపెట్టిస్తోంది. ఆ రాష్ట్రంలో వైరస్ కారణంగా ఏకంగా 20 పోలీస్ స్టేషన్లు మూసివేశారంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా కలకలం రేపుతోంది. బెంగళూరు సిటీలో విధులు నిర్వర్తిస్తున్న పలువురు పోలీసులకు వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయా పోలీస్ స్టేషన్లను మూసివేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. కరోనా కేసులు అధికంగా నమోదు అయినట్లు తెలిసిన ఆయా పోలీస్ స్టేషన్లను మూసివేయాలని బెంగళూరు పోలీసు కమిషనర్ భాస్కర్ రావు నిర్ణయించారు. ఈ క్రమంలో మొత్తం 20 పోలీసు స్టేషన్లను మూసివేనట్లు ప్రకటించారు.

ఇక నగరంలో అత్యవసర కేసులను పరిష్కరించేందుకు..మూసివేసిన పోలీస్ స్టేషన్ల పరిసరాల్లో హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేసిన్నట్లు అధికారులు తెలిపారు. హెల్ప్ డెస్క్‌లకు అందిన ఫిర్యాదుల మేరకు కేసులు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. కరోనా కేసులు నమోదైన పోలీస్ స్టేషన్లను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తున్నారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని స్టేషన్లను మూసివేసినట్లు సీపీ తెలిపారు. ట్రాఫిక్, సివిల్ పోలీసులతో పాటు హోంగార్డులకు సేఫ్టీ గ్లౌసులు, మాస్కులు, శానిటైజర్లు ఇచ్చామని సీపీ పేర్కొన్నారు.