కట్టడిలో కరోనా…ఆన్‌లైన్‌లో ‘జూ’ టికెట్లు

కరోనా దెబ్బకు ప్రపంచం మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. షాపింగ్ మాల్స్, హోటల్స్, సినిమా హాల్స్, ఒకటేమిటి అన్నీ లాక్‌డౌన్‌లో ఉండిపోయాయి. తిరిగి ఇప్పుడిప్పుడే కరోనా మహమ్మారి భయం నుంచి బయట పడుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ 5.0లో ఇచ్చిన వెసులుబాటుతో అన్ని వ్యవస్థలు గాడిలో పడుతున్నాయి. ఇందులో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు, వ్యాపార సంస్థలు ఇప్పటికే తెరుచుకున్నాయి. ఆలయాలను తెరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకా టూరిజం స్పాట్లు తెరుచుకోనప్పటికీ… త్వరలోనే వాటికి కూడా ఆంక్షలతో కూడిన […]

కట్టడిలో కరోనా...ఆన్‌లైన్‌లో  ‘జూ’ టికెట్లు

Updated on: Jun 05, 2020 | 8:31 AM

కరోనా దెబ్బకు ప్రపంచం మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. షాపింగ్ మాల్స్, హోటల్స్, సినిమా హాల్స్, ఒకటేమిటి అన్నీ లాక్‌డౌన్‌లో ఉండిపోయాయి. తిరిగి ఇప్పుడిప్పుడే కరోనా మహమ్మారి భయం నుంచి బయట పడుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ 5.0లో ఇచ్చిన వెసులుబాటుతో అన్ని వ్యవస్థలు గాడిలో పడుతున్నాయి. ఇందులో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు, వ్యాపార సంస్థలు ఇప్పటికే తెరుచుకున్నాయి. ఆలయాలను తెరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకా టూరిజం స్పాట్లు తెరుచుకోనప్పటికీ… త్వరలోనే వాటికి కూడా ఆంక్షలతో కూడిన అనుమతులు రానున్నాయి.

ఇక వేసవి కాలం… హాలిడే మూడ్‌లో చిన్నారులు… కోవిడ్-19 వ్యాప్తితో ఇంటికే పరిమితమైన కుటుంబాలు ఇప్పుడే ప్రభుత్వాలు ఇచ్చిన ఆంక్షలతో తిరిగి పనుల్లో పడిపోతున్నాయి. దీంతో కరోనా తీవ్రత దృష్ట్యా హైదరాబాద్‌లోని జూ పార్క్‌ టికెట్లను ఆన్‌లైన్‌లో జారీ చేయాలని అటవీ శాఖ నిర్ణయించింది. టికెట్‌ కౌంటర్ల వద్ద రద్దీని తగ్గించేందుకు ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఈ విధానాన్ని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఈ రోజు( జూన్ 5) అరణ్య భవన్‌లో ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌ జూపార్క్‌ వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకుని, నేరుగా టికెట్లను పొందవచ్చని అటవీ శాఖ వెల్లడించింది. ఆన్‌లైన్‌ టికెట్ బుకింగ్‌తో సరిగ్గా సమయానికి జూ పార్క్‌కు చేరుకొని పిల్లా పాపలతో ఏంజాయ్ చేయవచ్చు. దీంతో కరోనా కూడా కట్టడిలో ఉంటుంది.