దేశ వ్యాప్తంగా ‘వన్ నేషన్..వన్ రేషన్ కార్డు’ పథకం

ఇక దేశవ్యాప్తంగా వన్ నేషన్ వన్ రేషన్ కార్డు పథకాన్ని చేపడతామని  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ పథకం కింద రాష్ట్రాల్లో ఉన్నా  కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్నా ఎక్కడున్నా ఎవరైనా రేషన్ తీసుకోవచ్ఛునన్నారు. ఇప్పటికే ఈ పథకాన్ని 83 శాతం అమలు చేశామని, వచ్ఛే ఏడాది మార్చి నాటికి 100 శాతం అమలు చేస్తామని ఆమె చెప్పారు. పీ ఎం ఆవాస్ యోజన కింద రెంటల్ హౌసింగ్  స్కీమ్ ను అమలు చేస్తామని, […]

దేశ వ్యాప్తంగా వన్ నేషన్..వన్ రేషన్ కార్డు పథకం

Edited By:

Updated on: May 14, 2020 | 6:29 PM

ఇక దేశవ్యాప్తంగా వన్ నేషన్ వన్ రేషన్ కార్డు పథకాన్ని చేపడతామని  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ పథకం కింద రాష్ట్రాల్లో ఉన్నా  కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్నా ఎక్కడున్నా ఎవరైనా రేషన్ తీసుకోవచ్ఛునన్నారు. ఇప్పటికే ఈ పథకాన్ని 83 శాతం అమలు చేశామని, వచ్ఛే ఏడాది మార్చి నాటికి 100 శాతం అమలు చేస్తామని ఆమె చెప్పారు. పీ ఎం ఆవాస్ యోజన కింద రెంటల్ హౌసింగ్  స్కీమ్ ను అమలు చేస్తామని, ఇన్స్ టి ట్యూషన్లు, అసోసియేషన్లు తమ ప్రిమిసెస్ లో రెంటల్ హౌసింగ్ కోసమా తగిన ఏర్పాట్లు చేయాలనీ ఆమె సూచించారు. పట్టణ పేదలు, లేబర్ కార్మికులు తదితరులకు దీనివల్ల ప్రయోజనంకలుగుతుందన్నారు. ముద్ర పథకం కింద శిశు రుణాలు అందజేస్తామని, 50 వేల రుణాలు తీసుకునేవారు రెండు శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందన్నారు.