‘వన్ నేషన్..వన్ కార్డ్’ పథకం కింద మరో మూడు రాష్ట్రాలకు లబ్ది

| Edited By: Pardhasaradhi Peri

Jun 01, 2020 | 6:50 PM

వన్ నేషన్-వన్ కార్డ్ పథకంకింద మరో మూడు రాష్ట్రాలను చేర్చినట్టు కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తెలిపారు. ఒడిశా, సిక్కిం, మిజోరం రాష్ట్రాలను ఈ పథకంలో చేర్చినట్టు...

వన్ నేషన్..వన్ కార్డ్ పథకం కింద మరో మూడు రాష్ట్రాలకు లబ్ది
Follow us on

వన్ నేషన్-వన్ కార్డ్ పథకంకింద మరో మూడు రాష్ట్రాలను చేర్చినట్టు కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తెలిపారు. ఒడిశా, సిక్కిం, మిజోరం రాష్ట్రాలను ఈ పథకంలో చేర్చినట్టు ఆయన చెప్పారు. (ఇదే స్కీమ్ ని ఇంటిగ్రేటెడ్ మేనేజ్ మెంట్ ఆఫ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం అని వ్యవహరిస్తున్నారు). ఈ స్కీమ్ మేరకు రేషన్ కార్డు హోల్డర్లు సబ్సిడీతో కూడిన  ఆహార ధాన్యాలను దేశంలో ఏ చౌక ధర దుకాణంలోనైనా కొనుగోలు చేయవచ్ఛునని రామ్ విలాస్ పాశ్వాన్ వివరించారు. ఇప్పటివరకు ఏపీ, తెలంగాణ, బీహార్, గోవా రాష్ట్రాలతో సహా మొత్తం 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు దీన్ని విస్తరించారు. ఏమైనా….  వచ్ఛే ఏడాది మార్చి 31 నాటికి దేశంలో అన్ని రాష్ట్రాలకూ ప్రయోజనం కలుగుతుందని ఆయన చెప్పారు.