Omicron: దేశంలో మొదలైన ఒమిక్రాన్ టెన్షన్.. రాజస్థాన్‌లో కొత్తగా నలుగురికి పాజిటివ్. 49కి చేరిన మొత్తం కేసుల సంఖ్య!

|

Dec 14, 2021 | 1:57 PM

Omicron Variant Updates: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి విరుచుకుపడుతోంది. కొత్త రూపం మార్చుకున్న రాకాసి ఒమిక్రాన్ వేరియంట్.. చాపకింద నీరులా విస్తరిస్తోంది.

Omicron: దేశంలో మొదలైన ఒమిక్రాన్ టెన్షన్.. రాజస్థాన్‌లో కొత్తగా నలుగురికి పాజిటివ్. 49కి చేరిన మొత్తం కేసుల సంఖ్య!
Omicron
Follow us on

Omicron Variant Updates: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి విరుచుకుపడుతోంది. కొత్త రూపం మార్చుకున్న రాకాసి ఒమిక్రాన్ వేరియంట్.. చాపకింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా రాజస్థాన్‌లో నమోదైన కొత్త కేసు, దేశ రాజధాని ఢిల్లీలో మరో నాలుగు కేసులతో కలిపి, భారతదేశం మొత్తం Omicron కేసుల సంఖ్య 49 కి పెరిగాయి. ఇప్పటివరకు మహారాష్ట్రలో అత్యధికంగా 20 కేసులు నమోదు కాగా, రాజస్థాన్ లో 13, కర్ణాటకలో 3, గుజరాత్‌లో 4, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక్కొక్క కేసు బయటపడింది. అటు దేశ రాజధాని ఢిల్లీలో 6, చండీగఢ్ ఒక కేసు నమోదయ్యాయి. రాజస్థాన్‌లో ఇవాళ ఒక్కరోజే కోవిడ్-19 ఓమిక్రాన్ వేరియంట్‌ నాలుగు కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. రాష్ట్రంలోని మునుపటి ఓమిక్రాన్ కేసులన్నీ ఇప్పుడు కోవిడ్ నెగిటవ్‌గా పరీక్షలు వచ్చాయని రాజస్థాన్ ఆరోగ్య మంత్రి పార్సాది లాల్ మీనా చెప్పారు.

కాగా, రాజస్థాన్‌లోని ఒమిక్రాన్ వేరియంట్ కరోనావైరస్ బారిన పడిన తొమ్మిది మంది వ్యక్తులు రెండుసార్లు ఇన్‌ఫెక్షన్‌కు నెగెటివ్ పరీక్షలు చేయడంతో గురువారం ఇక్కడి ప్రభుత్వ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారని ఆరోగ్య మంత్రి పర్సాది లాల్ మీనా తెలిపారు. రక్తం, సిటి స్కాన్, ఇతర అన్ని పరీక్షల కోసం వారి నివేదికలు సాధారణమైనవిగా వచ్చాయని, అయితే వారం రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించినట్లు ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా, రాజస్థాన్‌లో కొత్తగా మరో 38 మందికి కోవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు.


ఇదిలావుంటే, కోవిడ్-19 ఓమిక్రాన్ వేరియంట్ ఢిల్లీ మొదటి రోగి, రాంచీకి చెందిన 37 ఏళ్ల వ్యక్తి, లోక్ నాయక్ జై ప్రకాష్ నారాయణ్ (ఎల్‌ఎన్‌జెపి) ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయినట్లు ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. కోవిడ్-19 ఓమిక్రాన్ వేరియంట్ బారిన పడిన మరో ఇద్దరు పూర్తిగా వ్యాక్సిన్ పొందిన వ్యక్తులను మహారాష్ట్ర వెల్లడించింది. ఇద్దరు వ్యక్తులు దుబాయ్ నుంచి వచ్చినట్లు తెలిపారు. అయితే దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చిన వ్యక్తి గుజరాత్‌లో పాజిటివ్‌గా నిర్ధారించారు.

మరోవైపు, కోవిడ్ -19 కొత్త ఓమిక్రాన్ వేరియంట్ ప్రపంచవ్యాప్త వ్యాప్తి కారణంగా దక్షిణ కొరియా విదేశీ ప్రయాణాలపై నిషేధం మరో నెలపాటు పొడిగించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. భారత పౌరులను జనవరి 13 వరకు అనవసరమైతే తప్ప విదేశీ పర్యటనలను రద్దు చేసుకోవాలని కేంద్ర సూచించింది. విదేశీ ప్రయాణాలపై కేంద్రం మొదట మార్చిలో ఆంక్షలు విధించింది. అయా దేశాలు మహమ్మారితో పోరాడుతూనే ఉన్నందున ప్రతి నెలా పొడిగిస్తూ వస్తుంది.

Read Also…  Panjab High Court: ఫోన్ రికార్డింగ్ వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించడమే.. వాటిని పరిగణలోకి తీసుకోలేం..