గోల్డెన్‌ మాస్క్‌ గురూ.. ధర చూస్తే షాక్ తినాల్సిందే‌..!

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్‌కు వ్యాక్సిన్ లేకపోవడంతో.. రోజురోజుకు కేసుల సంఖ్య అమాంతం పెరుగుతున్నాయి. అయితే దీని బారినపడకుండా ఉండేందుకు అనేక జాగ్రత్తలు..

గోల్డెన్‌ మాస్క్‌ గురూ.. ధర చూస్తే షాక్ తినాల్సిందే‌..!

Edited By:

Updated on: Jul 17, 2020 | 10:19 PM

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్‌కు వ్యాక్సిన్ లేకపోవడంతో.. రోజురోజుకు కేసుల సంఖ్య అమాంతం పెరుగుతున్నాయి. అయితే దీని బారినపడకుండా ఉండేందుకు అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ముఖ్యంగా బయటకు వెళ్లినప్పుడు సోషల్ డిస్టెన్స్ పాటించడం.. మాస్క్‌ తప్పనిసరిగా ధరించడంతో పాటు.. ఎప్పటికప్పుడు చేతులను శుభ్రంగా కడుక్కోవడం వంటివి చేయడం ద్వారా.. వైరస్‌ బారినపడకుండా జాగ్రత్తపడవచ్చు. ఈ క్రమంలో అనేక దేశాలు మాస్క్‌లను తప్పనిసరి చేశాయి. మాస్క్‌లు ధరించడం ద్వారా వైరస్ బారినపడే అవకాశం తక్కువగా ఉండంటంతో.. అనేక ప్రభుత్వాలు మాస్క్ నిబంధనను కఠినతరం చేస్తున్నాయి. దీంతో ప్రజలంతా రకరకాల మాస్క్‌లను ధరిస్తున్నారు. కొందరు రాజకీయ నేతల మాస్క్‌లను ధరిస్తే.. మరికొందరు సినీ ప్రముఖుల ఫోటోలతో ఉన్న మాస్క్‌లను ధరిస్తున్నాయి. అయితే కొందరు అందుకు భిన్నంగా వజ్రాలతో తయారు చేసిన మాస్క్‌లను, బంగారంతో రెడీ చేసిన మాస్క్‌లను పెట్టుకుంటూ.. అందర్నీ ఆకర్షిస్తున్నారు. ఇప్పటికే సూరత్‌ ప్రాంతంలో డైమండ్ మాస్క్‌లకు భలే గిరాకీ ఉన్న సంగతి తెలిసిందే.

తాజాగా.. ఒడిషా రాష్ట్రం కటక్‌కు చెందిన అలోక్ అనే వ్యాపారవేత్త.. గోల్డెన్‌ మాస్క్‌ ధరించి అందర్నీ ఆకర్షిస్తున్నారు. దీని విలువ రూ.3.5 లక్షలకు పైగా ఉంటుంది. ఇంత ఖరీదైన మాస్క్‌ ధరించడంపై సదరు బిజినెస్ మ్యాన్ స్పందించారు. తాను 40 సంవత్సరాలుగా బంగారాన్ని ధరిస్తున్నానని.. తనకు బంగారం వస్తువులను ధరించడం అంటే ఎంతో ఇష్టమని తెలిపాడు. స్తానికంగా తనను గోల్డ్‌మ్యాన్ అని పిలుస్తారని కూడా చెప్పుకొచ్చాడు అలోక్ మొహంతి. ఈ క్రమంలో ప్రస్తుతం కరోనా కట్టడిలో భాగంగా మాస్క్‌లను ధరించడం తప్పనిసరి చేసిన నేపథ్యంలో తాను బంగారంతో తయారు చేసిన మాస్క్‌ను పెట్టుకుంటున్నట్లు తెలిపారు.