ఇళ్లల్లోనే ప్రార్ధనలు చేసుకోవాలి..

| Edited By:

Mar 27, 2020 | 12:19 PM

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా మందిరాలు, మసీదులు, చర్చ్‌లలో సామూహిక ప్రార్ధనలను నిషేధించారు. అయితే గత మూడు రోజులుగా పలుచోట్ల సామూహిక ప్రార్ధనలు చేసినట్లు వార్తలు రావడంతో.. ముస్లిం మతపెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను తప్పకుండా పాటించాలని స్పష్టం చేశారు. నేడు శుక్రవారం సందర్భంగా దేశ వ్యాప్తంగా మసీదుల్లో కాకుండా.. ఇళ్లలోనే ప్రార్ధనలు […]

ఇళ్లల్లోనే ప్రార్ధనలు చేసుకోవాలి..
Follow us on

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా మందిరాలు, మసీదులు, చర్చ్‌లలో సామూహిక ప్రార్ధనలను నిషేధించారు. అయితే గత మూడు రోజులుగా పలుచోట్ల సామూహిక ప్రార్ధనలు చేసినట్లు వార్తలు రావడంతో.. ముస్లిం మతపెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను తప్పకుండా పాటించాలని స్పష్టం చేశారు. నేడు శుక్రవారం సందర్భంగా దేశ వ్యాప్తంగా మసీదుల్లో కాకుండా.. ఇళ్లలోనే ప్రార్ధనలు చేయాలని ఫత్వాలు జారీ చేశారు. ప్రభుత్వాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని.. లాక్‌డౌన్ ముగిసే వరకు ఇళ్లలోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు.

ఇక హైదరాబాద్‌ మక్కా మసీదులో కూడా సామూహిక ప్రార్థనలు కూడా నిర్వహించడం లేదని తెలిపారు. అంతా ఇళ్లల్లోనే ప్రార్థనలు చేసుకోవాలని.. ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ
అసదుద్దీన్ ఓవైసీ సూచించారు.