‘ఏం చేయాలో నాకు తెలుసు.’.. లాక్ డౌన్ అవసరమే లేదన్న ట్రంప్ .

తమ దేశంలో కరోనా మరణాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికీ తేలికగానే తీసుకుంటున్నారు. ఈ రాకాసి అదుపునకు తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.  వీటిని రిపబ్లికన్ గవర్నర్లతో బాటు డెమొక్రాట్ గవర్నర్లు కూడా ఆమోదించినట్టు తెలిపారు. వైట్ హౌస్ లో మీడియాతో మాట్లాడిన అయన.. ఏ నిర్ణయమైనా తీసుకునే అధికారం తమకు ఉందన్నారు. దేశంలో లాక్ డౌన్ విధించి ఉంటే కరోనా మరణాలు ఇన్ని సంభవించి ఉండేవి కావన్న ఆంథోనీ ఫోసీ హెచ్చరికలను ఆయన కొట్టి […]

ఏం చేయాలో నాకు తెలుసు... లాక్ డౌన్ అవసరమే లేదన్న ట్రంప్ .

Edited By:

Updated on: Apr 14, 2020 | 8:52 PM

తమ దేశంలో కరోనా మరణాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికీ తేలికగానే తీసుకుంటున్నారు. ఈ రాకాసి అదుపునకు తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.  వీటిని రిపబ్లికన్ గవర్నర్లతో బాటు డెమొక్రాట్ గవర్నర్లు కూడా ఆమోదించినట్టు తెలిపారు. వైట్ హౌస్ లో మీడియాతో మాట్లాడిన అయన.. ఏ నిర్ణయమైనా తీసుకునే అధికారం తమకు ఉందన్నారు. దేశంలో లాక్ డౌన్ విధించి ఉంటే కరోనా మరణాలు ఇన్ని సంభవించి ఉండేవి కావన్న ఆంథోనీ ఫోసీ హెచ్చరికలను ఆయన కొట్టి పారేశారు. కరోనా నివారణకు వైట్ హౌస్ లో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కి చైర్మన్ అయిన..ఫోసీని కూడా తన వద్దకు రమ్మని ట్రంప్ పిలిపించారు. ఆయనను తొలగించాలన్న యోచన తనకు లేదని, అయితే ఆయన సూచనలను పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. ‘మేం ఇక్కడ (అధికారంలో) ఉండకపోతే మీరు కూడా ఇక్కడ ఉండేవారు కారు’ అని మీడియాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దేశంలో మళ్ళీ బిజినెస్ కార్యకలాపాలు ప్రారంభమయ్యేలా చూస్తామని, దేశ ఆర్ధిక వ్యవస్థకు పెద్ద పీట వేస్తామని ట్రంప్ చెప్పారు. పైగా తన ప్రభుత్వం సాధించిన విజయాలను హైలైట్ చేసేట్టు ఉన్న ఓ వీడియోను కూడా ఆయన రిలీజ్ చేశారు. .