లాక్‌డౌన్ పొడిగింపు లేదు.. స్పష్టం చేసిన సీఎం..

| Edited By:

Jun 30, 2020 | 4:35 PM

కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో.. పలు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ కొనసాగిస్తున్నాయి. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం రెండో విడుత అన్‌లాక్‌కు రంగం సిద్దం చేసింది. మరోవైపు కేసులు..

లాక్‌డౌన్ పొడిగింపు లేదు.. స్పష్టం చేసిన సీఎం..
Follow us on

కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో.. పలు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ కొనసాగిస్తున్నాయి. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం రెండో విడుత అన్‌లాక్‌కు రంగం సిద్దం చేసింది. మరోవైపు కేసులు పెరుగుతున్న రాష్ట్రాలు తిరిగి లాక్‌డౌన్ విధించేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో పంజాబ్ సీఎం లాక్‌డౌన్ విషయంపై స్పందించారు. రాష్ట్రంలో లాక్‌డౌన్ పొడిగించేది లేదని స్పష్టం చేశారు. ప్రజలంతా సోషల్ డిస్టెన్స్‌ ఖచ్చితంగా పాటించాలని.. కరోనా బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో మరో నాలుగు కరోనా టెస్టు కేంద్రాలను ఏర్పాటు చేసి.. రోజుకు ఇరవై వేల మందికి పైగా కరోనా టెస్టులు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఐదు వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ప్రస్తుతం రోజుకు పదివేలకు పైగా కరోనా పరీక్షలు చేస్తున్నామని పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్‌ సింగ్‌ తెలిపారు.