ఆత్మ నిర్భర్ భారత్ ‘ప్యాకేజీ’పై కేంద్రమంత్రి మరో కీలక ప్రకటన..

| Edited By:

May 17, 2020 | 10:46 AM

ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల “ఆత్మనిర్భర్ భారత్” ప్యాకేజీకి సంబంధించి రోజుకో ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుపుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం నాడు కూడా ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి రంగాల్లో నిర్మాణాత్మక సంస్కరణలను ప్రతిపాదించారు. అధికంగా ప్రైవేటీకరణపై దృష్టి పెట్టినట్లు ప్రకటించారు. ఇక విద్యుత్ బోర్డుల దగ్గరి నుంచి మొదలుకొని ఎయిర్ పోర్ట్‌ల వరకు వాటిని ప్రైవేటీకరించేందుకు […]

ఆత్మ నిర్భర్ భారత్ ‘ప్యాకేజీ’పై కేంద్రమంత్రి మరో కీలక ప్రకటన..
Follow us on

ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల “ఆత్మనిర్భర్ భారత్” ప్యాకేజీకి సంబంధించి రోజుకో ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుపుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం నాడు కూడా ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి రంగాల్లో నిర్మాణాత్మక సంస్కరణలను ప్రతిపాదించారు. అధికంగా ప్రైవేటీకరణపై దృష్టి పెట్టినట్లు ప్రకటించారు. ఇక విద్యుత్ బోర్డుల దగ్గరి నుంచి మొదలుకొని ఎయిర్ పోర్ట్‌ల వరకు వాటిని ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇక ఇవాల ఆదివారం నాడు కూడా ప్యాకేజీకి సంబంధించిన వివరాలను మరికాసేపట్లో ప్రకటించనున్నారు.