New Coronavirus: కొత్త కరోనా వైరస్‌పై సీసీఎంబీ పరిశోధనలు.. డబుల్ మ్యూటెంట్ మరింత డేంజరస్?

|

Apr 19, 2021 | 6:05 PM

సెకండ్ వేవ్ ఇంతగా వ్యాపించడానికి కారణం ఏంటనే కోణంలో పరిశోధనలు జరుగుతున్నాయి. అసలు కారణం డ‌బుల్ వేరియంట్ బి.1.617 అంటున్నారు. అసలు డబుల్ వేరియంట్ అంటే ఏంటో తెలుసుకుందాం…

New Coronavirus: కొత్త కరోనా వైరస్‌పై సీసీఎంబీ పరిశోధనలు.. డబుల్ మ్యూటెంట్ మరింత డేంజరస్?
Follow us on

New Coronavirus more dangerous: క‌రోనా వైర‌స్ (CORONAVIRUS) ప్రపంచదేశాలకు దడ పుట్టిస్తోంది. మనదేశంలోను ప్రతిరోజు లక్షల్లో కరోనా పాజిటివ్ కేసులు (CORONA POSITIVE CASES) నమోదవుతున్నాయి. భారత్‌లో దాదాపు మూడు లక్షల దగ్గరకు రోజు వారీ కరోనా కేసులు వెెళ్లాయంటేనే వైరస్ ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు సెకండ్ వేవ్ (SECOND WAVE) ఇంతగా వ్యాపించడానికి కారణం ఏంటనే కోణంలో పరిశోధనలు జరుగుతున్నాయి. అసలు కారణం డ‌బుల్ వేరియంట్ బి.1.617 అంటున్నారు. అసలు డబుల్ వేరియంట్ అంటే ఏంటో తెలుసుకుందాం…

కరోనా వైరస్ సెకండ్ వేవ్ మనదేశంలో తీవ్ర స్థాయిలో ఉంది. సగటున రోజుకు రెండు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. త్వరలో ప్రతిరోజు నమోదయ్యే కరోన కేసుల సంఖ్య మూడు లక్షలు దాటే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే ప్రపంచంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదైన దేశంగా మన దేశం నిలువబోతోంది. ఒక్క అమెరికా (AMERICA)లోనే ఇప్పటివరకు మూడు లక్షల కేసులు ఒకరోజు నమోదయ్యాయి. అత్యధికంగా కేసులు నమోదైన దేశాల్లో కూడా అమెరికానే మొదటి స్థానంలో ఉంది. అయితే ప్రస్తుతం భారత దేశంలో లక్షలాది కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రపంచం (WORLD)లోనే అత్యధికంగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యే దేశంగా మన దేశం మారబోతోంది.

ఇండియా (INDIA)లో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఇంత తీవ్ర స్థాయిలో ఉండటానికి ప్రధాన కారణం డబుల్ మ్యూటెంట్ (DOUBLE MUTANT) అయిన వైరస్ కారణం కావచ్చని శాస్త్రవేత్తలు (SCIENTISTS) భావిస్తున్నారు. దీనిని బి.1.617 (B.1.617) వేరియంట్‌గా శాస్త్రవేత్తలు పిలుస్తున్నారు. ఈ కొత్త కరోనా వైరస్ వేరియంట్‌పై హైదరాబాద్‌ (HYDERABAD)కు చెందిన సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబి) అధ్యయనం కొనసాగిస్తోంది. డబుల్ మ్యూటెంట్ వేరియంట్ అయిన ఈ కొత్తరకం కరోనా వైరస్ శరవేగంగా విస్తరించడం మూలంగానే ఇండియాలో సెకండ్ ఇంత తీవ్ర స్థాయిలో ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ కొత్త రకం కరోనా వైరస్ జన్యు క్రమాన్ని సిసిఎంబి (CCMB) అధ్యయనం చేస్తోంది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ (ANDHRA PRADESH), తెలంగాణ (TELANGANA), కర్నాటక (KARNATAKA) రాష్ట్రాల నుంచి కొన్ని శాంపిళ్ళను సిసిఎంబి శాస్త్రవేత్తలు సేకరించారు. జీనోమ్ సీక్వెన్సింగ్ (GENOM SEQUENCING) చేస్తున్న పరిశోధకులు.. మరో రెండు వారాల్లో పరిశోధన ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. ఈ కొత్త వేరియంట్ ఇంకా పరివర్తనం చెందుతుందా అన్న కోణంలో సిసిఎంబి స్టడీ కొనసాగుతోంది. అయితే ఇతర వేరియంట్ల కన్నా బి.1.617 రకం కరోనా వైరస్ ప్రమాదకరంగా వ్యాప్తి చెందుతూ ఉండగా దానికి సంబంధించి తమ వద్ద ఇంకా ఆధారాలు లేవని సిసిఎంబి డైరెక్టర్ డాక్టర్ రాకేష్ మిశ్రా చెబుతున్నారు.

అయితే బి.1.617 వేరియంట్ తరచూ పరివర్తనం చెందుతుందా లేదా అన్నది ఇంకా తేలలేదు. కానీ ఈ వేరియంట్లో మరో రెండు యూనిట్లు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటికి E484E, L452R అని నామకరణం చేశారు. ఈ రెండు వెరైటీలను సిసిఎంబి కనిపెట్టింది. వైరస్‌లలో రెండు రకాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటిలో ఒకటి సహజసిద్ధంగా పరివర్తనం చెందే వైరస్ కాగా మరికొన్ని క్రమంగా బలహీనపడే వైరస్‌లు ఉంటాయి. అంటే కొన్ని రకాల వైరస్ఋలు తరచూ పరివర్తనం చెందడం ద్వారా మరింత బలపడితే, మరికొన్ని వైరస్‌లు మాత్రం తరచూ పరివర్తనం చెందడం ద్వారా బలహీన పడుతూ ఉంటాయి. బలహీనపడిన మ్యూటెంట్లు వేగంగా వ్యాప్తి చెందుతాయని సిసిఎంబి శాస్త్రవేత్త డాక్టర్ రాకేష్ మిశ్రా చెబుతున్నారు. మహారాష్ట్ర(MAHARASHTRA) చెందిన 50 శాతం శాంపిళ్లు పరిశీలించినట్లు తెలుస్తోంది. వాటి జన్యువుల్లో బి.1.617 వేరియంట్‌ని గుర్తించారు. ఇదే రకం వేరియంట్‌ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ (KERALA) రాష్ట్రాల్లో నమోదైన కేసుల్లో కనిపించినట్లు తెలుస్తోంది. పంజాబ్‌ (PUNJAB)లో సేకరించిన శాంపిళ్ళలో మాత్రం యూకే (UK) వేరియంట్ బి.1.17 రకం కరోనా వైరస్ బయటపడింది. కొత్త వేరియంట్ల ద్వారా విస్తరిస్తున్న కరోనా వైరస్‌పై ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు పనిచేస్తాయా లేదా అన్న విషయంపై అధ్యయనం కొనసాగుతోంది. ఈ అధ్యయనం ద్వారా కరోనా వైరస్ ప్రాణాంతకంగా మారిందా లేదా బలహీనపడింది అన్న అంశాన్ని సిసిఎంబి తేల్చబోతోంది.

దేశంలో 80 శాతం కేసులు పెరగడానికి ప్రజల నిర్లక్ష్యమే కారణమని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. మాస్కులు పెట్టుకోకపోవడం (NO MASK), ఆరుబయట విచ్చలవిడిగా తిరగడం, తీసుకునే ఆహార పదార్థాలు, గాలి, నీరు.. ఇలాంటి వాటి వల్లే దేశంలో కరోనా వైరస్ తీవ్రత పెరిగిందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ప్రజలంతా సరైన జాగ్రత్తలు పాటించక తప్పదని, కేవలం కరోనా వైరస్‌ను నియంత్రించడం సాధ్యం కాదని సీసీఎంబీ చెబుతోంది. పరిస్థితి అదుపులోకి వచ్చేవరకూ మాస్కులు ధరించడం (WEARING MASK), భౌతిక దూరాలను పాటించడం (SOCIAL DISTANCING), శానిటైజర్ (SANITIZER) వినియోగించడం తప్పనిసరి చేసుకోవాలని ప్రజలకు సీసీఎంబీ పిలుపునిచ్చింది.

Aryabhatta Satellite: ఆర్యభట్టకు 46 ఏళ్ళు.. భారత తొలి ఉపగ్రహానికి ఆ పేరే ఎందుకు పెట్టారంటే? – Aryabhatta Satellite India’s First Satellite (tv9telugu.com)