వలస కూలీలకు శాశ్వత ఉపాధి

| Edited By: Pardhasaradhi Peri

May 29, 2020 | 9:12 AM

సొంత రాష్ట్రానికి చేరుకున్న వలస కార్మికులకు ఉపాధి కల్పించేందుకు సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది మధ్యప్రదేశ్ సర్కార్. త్వరలోనే ‘రోజ్‌గార్ సేతు యోజన’ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. ఎన్నో కష్టాలను ఓర్చి ఇంటి బాట పట్టిన వారికి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతుందని శివరాజ్ సింగ్ చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి తిరిగివచ్చిన నిపుణులైన వలసకార్మికులను సర్వే చేసి వారి వివరాలతో ఓ డేటాబేస్ ను తయారు చేస్తున్నట్లుగా […]

వలస కూలీలకు శాశ్వత ఉపాధి
Follow us on

సొంత రాష్ట్రానికి చేరుకున్న వలస కార్మికులకు ఉపాధి కల్పించేందుకు సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది మధ్యప్రదేశ్ సర్కార్. త్వరలోనే ‘రోజ్‌గార్ సేతు యోజన’ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. ఎన్నో కష్టాలను ఓర్చి ఇంటి బాట పట్టిన వారికి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతుందని శివరాజ్ సింగ్ చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి తిరిగివచ్చిన నిపుణులైన వలసకార్మికులను సర్వే చేసి వారి వివరాలతో ఓ డేటాబేస్ ను తయారు చేస్తున్నట్లుగా చెప్పారు. నిపుణులైన వలసకార్మికులకు ఎంపిక చేసి చిన్న, గ్రామీణ పరిశ్రమల్లో ఉపాధి కల్పిస్తామన్నారు. అంతేకాకుండా… “స్వామిత్వ పథకం” కింద గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను డ్రోన్ల సాయంతో సర్వే చేసి పేదలకు పట్టాలిస్తామని ప్రకటించారు సీఎం.