బీజేపీ చీఫ్‌కు ట్విట్టర్ వేదికగా చురకలంటించిన హరీష్‌రావు

బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాపై తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్‌ రావు విమర్శలుగుప్పించారు. మానవాళిక పెను సవాల్‌ విసురుతున్నకరోనా వైరస్ విషయంలో రాజకీయాలు చేయడం కరెక్టేనా అంటూ..

బీజేపీ చీఫ్‌కు ట్విట్టర్ వేదికగా చురకలంటించిన హరీష్‌రావు

Edited By:

Updated on: Jun 21, 2020 | 5:17 PM

బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాపై తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్‌ రావు విమర్శలుగుప్పించారు. మానవాళిక పెను సవాల్‌ విసురుతున్నకరోనా వైరస్ విషయంలో రాజకీయాలు చేయడం కరెక్టేనా అంటూ ట్విట్టర్‌ వేదికగా మండిపడ్డారు. దేశ రక్షణ విషయంలో విమర్శలు చేయడం ద్వారా.. సైన్యం ఆత్మస్థైర్యం కోల్పోతుందన్న మీరు.. కరోనా పరీక్షల విషయంలో రాష్ట్రాలపై ఆరోపణలు చేయడం సరైందేనా అంటూ ప్రశ్నించారు. వైద్యులు చేస్తున్న కృషిని తక్కువ చేసి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటూ ట్విట్టర్ వేదికగా నిలదీశారు. ప్రస్తుతం కరోనా విషయంలో రాజకీయాలు చేస్తే.. దేశ భద్రత విషయంలో చులకనగా మాట్లాడటంతో సమానమని హరీష్ రావ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.