తెలంగాణ ఆరోగ్య శాఖ అలర్ట్: జ్వరం ఉన్న అందరికీ కరోనా టెస్టులు

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ తెలంగాణ సర్కారు పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు పోతోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మరో నిర్ణయం తీసుకుంది...

తెలంగాణ ఆరోగ్య శాఖ అలర్ట్: జ్వరం ఉన్న అందరికీ కరోనా టెస్టులు
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 23, 2020 | 3:34 PM

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ తెలంగాణ సర్కారు పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు పోతోంది. ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తూ..ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనూ పరీక్షలు చేస్తున్నారు. జిల్లా కేంద్రాల్లోనూ కోవిడ్ ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేసి వైద్యం అందజేస్తున్నారు. మరో వైపు గాంధీతో పాటుగా ఫివర్, కింగ్ కోఠి ఆస్పత్రులను కూడా పూర్తిస్థాయి కోవిడ్ ఆస్పత్రులుగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది.

ఈ క్రమంలోనే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మరో నిర్ణయం తీసుకుంది. జ్వరం వ‌చ్చిన ప్రతిఒక్కరిని వీలైనంత త్వరగా గుర్తించి పరీక్షలు చేయాల‌ని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ వైద్యాధికారుల‌తో సమావేశం జరిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కరోనా కట్టడి పట్ల తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. త్వరగా వైరస్‌ను గుర్తిస్తే ప్రాణ నష్టం జరగకుండా చూడొచ్చని, జ్వరం వచ్చిన వారందరినీ ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు వీలైనంత త్వరగా గుర్తించి పరీక్షలు చేయించాలని మంత్రి ఈటల సూచించారు. దీని ద్వారా వైర‌స్ ఉన్నట్లు నిర్ధార‌ణ అయినా ప్రాణ‌న‌ష్టం జ‌ర‌గ‌కుండా ఉంటుందని ఈటల పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో వైద్య సిబ్బంది ప్రజల ప్రాణాలు కాపాడ‌టానికి చాలా శ్రమిస్తున్నారని ఈటల ప్రశంసించారు.