మాస్కుల తయారీకి గొర్రెలు లేవు… మాట జారిన మంత్రి

|

Jun 02, 2020 | 10:12 AM

కారోనా కట్టడికి సరిపడే ఫేస్‌ మాస్కులను అందించలేక పోతున్నామని మాట్లాడుతూ.. ఈ పొరపాటు చేశారు మంత్రిగారు. మాస్కుల తయారీకి తగిన ముడి సరుకులు మన దగ్గర లభించటం లేదన్నారు. అందుకు ఉపయోగించే కాటన్‌ను ఉత్పత్తి చేయడానికి తగినన్ని గొర్రెలు సింగపూర్‌లో లేవన్నారు.

మాస్కుల తయారీకి గొర్రెలు లేవు... మాట జారిన మంత్రి
Follow us on

మనుషులను గొర్రెలు చేయటం… గొర్రెలను మరొకటి చేయటం రాజకీయ నాయకులను కామన్. అయితే సింగపూర్‌కు చెందిన ఓ మంత్రి ఇలాంటి పొరపాటే చేశారు. అది కూడా మీడియా ముందు ఇంటర్వ్యూ ఇస్తూ.. తప్పులో కాలు వేశారు సింగపూర్‌ వాణిజ్య, పరిశ్రమల మంత్రి చాన్‌ చున్‌ సింగ్‌. ఆ తప్పు కూడా లైవ్ ఇంటర్వ్యూలో జరిగింది. మాట్లాడిన తప్పును వెంటనే కవర్ చేశారు.

కారోనా కట్టడికి సరిపడే ఫేస్‌ మాస్కులను అందించలేక పోతున్నామని మాట్లాడుతూ.. ఈ పొరపాటు చేశారు మంత్రిగారు. మాస్కుల తయారీకి తగిన ముడి సరుకులు మన దగ్గర లభించటం లేదన్నారు. అందుకు ఉపయోగించే కాటన్‌ను ఉత్పత్తి చేయడానికి తగినన్ని గొర్రెలు సింగపూర్‌లో లేవన్నారు. ఆ తరువాత తన పొరపాటును గ్రహించి తనలో తానే నవ్వుకున్నారు. అప్పటికే జరగకూడని పొరపాటు జరిగిపోయింది. ఇంకేముంది నెటిజన్లు సదరు మంత్రిగారిని ఓ ఆట ఆడుకుంటున్నారు

నెటిజన్లు కామెంట్స్‌కు రీ ట్వీట్ చేశారు. కాటన్ పత్తి నుంచి వస్తుంది… గొర్రెల నుంచి కాదు…అంటూ జరిగిన పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే మంత్రి చాన్‌ చున్‌ సింగ్‌ నోరు జారడం ఇదే మొదటిసారి కాదు… గతంలోనూ ఇలాంటి పొరపాటే చేశారు. లాక్‌డౌన్ సమయంలో మాల్స్ ముందు క్యూ కట్టిన ప్రజలను ‘ఇడియట్స్‌’ అని కామెంట్‌ చేశారు.