
దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వలస కార్మికులు ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయారు. అయితే వీరందర్నీ.. కేంద్ర ప్రభుత్వం శ్రామిక్ ట్రైన్లు ఏర్పాటు చేసి.. స్వరాష్ట్రాలకు పంపిస్తోంది. అంతేకాదు.. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా.. ఎన్‌జీవో సంస్థలతో కలిసి.. వలస కార్మికులు వారి వారి స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రత్యేక వాహనాలను, బస్సులను ఏర్పాటు చేస్తోంది. అయితే అనేక రాష్ట్రాలు.. వలస కార్మికులు స్వరాష్ట్రాలకు వచ్చాక క్వారంటైన్ సెంటర్లలో ఉంచుతున్నారు. అయితే యూపీలో ఇలా క్వారంటైన్ సెంటర్‌లో ఉంచిన ఓ వలస
కార్మికుడు.. క్వారంటైన్ సెంటర్ నుంచి తప్పించుకొని.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. తింద్వారీ పోలీస్ స్టేషన్ పరిధిలోని జవహార్‌పూర్ గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. జగదీష్ ప్రసాద్ అనే వ్యక్తి ఆరు నెలల క్రితం.. బతుకుదెరువు కోసం సూరత్ వెళ్లాడు. అయితే కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో.. అందరిలానే అతను కూడా స్వస్థలానికి వెళ్లాడు. అయితే గ్రామంలోని క్వారంటైన్ సెంటర్‌లో ఉంచారు అక్కడి అధికారులు. అయితే అక్కడి నుంచి తప్పించుకొని.. అతడి మామ ఇంటికి వెళ్లి ఉరివేసుకున్నాడు. అయితే సంఘటనకు ముందు భార్యతో రేషన్ విషయంలొ గొడవ పడ్డట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.